గత కొద్ది నెలల నుండి మాలికలో ఎప్పుడు ఒక బ్లాగరు పోస్టులే పైన ఉంటున్నాయి అని, అవి అన్ని రీసైక్లింగ్ చేసున్న పాత పోస్ట్ లు అని కొంత మంది బ్లాగర్లు ఈ-మేయిల్ పంపారు. అందరికి ధన్యవాదాలు.
మాలికలో బ్లాగుల వరుస క్రమం అనేది పోస్ట్ చేసిన తేది, సమయంను బట్టి ఉంటుంది. అయితే బ్లాగర్ లో ఒక సదుపాయం ఉంది. మనం పోస్ట్ చేసిన తేది, సమయం మార్చుకోవచ్చు.
మాలిక ను తయారు చేస్తున్నప్పుడు నాముందున్న ఆప్షన్స్ రెండు. ఒకటి టపాను పొస్ట్ (published date) చేసిన సమయాన్ని ఆధారంగా వరుస క్రమం (sort) తయారు చేయడం, లేదా టపాను మొదలు పెట్టిన సమయాన్ని ఆధారంగ (created date) వరుస క్రమాన్ని తయారు చేయడం.
టపాను మొదలు పెట్టిన సమయాన్ని తీసుకొని వరుస క్రమం చేయడం వలన ఎవరైన టపా మొదలు పెట్టి దానిని డ్రాఫ్ట్ లా సేవ్ చేసి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పూర్తి చేసి పోస్ట్ చేస్తే అది మాలికలో ఆడుగున ఎక్కడో చేరిపోతుంది. అందుకని నేను టపాను పోస్ట్ చేసిన సమయాన్ని వరుస క్రమం కోసం తీసుకోవడం జరిగింది.
గతంలో మాలిక మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టినప్పుడు ఎవరైనా పోస్ట్ చేసిన సమయం మారిస్తే వారికి ఈమేయిల్ పంపేవాడిని అలా చేయకండి, అని. ఐతే గడిచిన కొద్ది నెలలుగా ఈ లొసుగును పట్టుకొని నెత్తినెక్కి కూర్చునే బ్లాగర్లు ఒకరిద్దరు తయారయ్యారు. బ్లాగుల్లో వాతలు పెట్టుకునే జనాలకు తక్కువలేదు. ఇది చూసి ఇంకో నలుగురు బ్లాగర్లు ఇదే బాట పట్టొచ్చు. అందుకే ఇక ఉపేక్షించదల్చుకోలేదు. ఇక నుండి ఎవరైనా బ్లాగర్లు పోస్టుచేసిన సమయం మార్చి వరుస క్రమంలో ముందుకు రావడానికి ప్రయత్నించినట్లు తెలిస్తే వారి బ్లాగుకు పెనాల్టి పడుతుంది. అంటే వాళ్ళు ఏం పోస్టు చేసిన అవి మాలిక చివరిలోకి వెళ్ళి పోతాయి. బ్లాగర్లు అందరికి నిశ్పక్షపాతంగా మాలిక లో స్థానం కలిపించాలి అన్నదే ఉద్దేశం.
ఎవరి బ్లాగులైనా ప్రైవేట్ బ్లాగులుగా (invited users only) మారిస్తే వాటిని అగ్రిగేట్ చేయడానికి వీలుపడదు. అందుకని వాటిని మాలిక లో నుండి తప్పిస్తున్నాము. వీటిని అందరూ చదవడానికి అవకాశం కలిపించినప్పుడు మాలిక అడ్మిన్ కు తెలియజేయంది. తిరిగి మాలికలో కలపడానికి మాకు అభ్యంతరం లేదు.
బ్లాగుల్లో వ్యాఖ్యలకు నియంత్రణ (moderation) పెట్టుకోవాల వద్దా అన్నది బ్లాగు ఓనర్ నిర్ణయం. అయితే కొన్ని నియంత్రణ లేని బ్లాగుల్లో స్పామర్ల్ ఇష్టం వచ్చిన చెత్త అంతా వ్యాఖ్యల రూపంలో నింపి పోతున్నారు. అది యధాతదంగా మాలికలో చేరి పోతుంది. ఒక్కోసారి వ్యాఖ్యల పేజీ మొత్తం ఇలాంటి చెత్తతో నిండి పోయిన సందర్భాలు ఉన్నాయి. వీటి నియంత్రణ బ్లాగు ఓనర్ల పని. ఇక నుండి బ్లాగుల్లో నుండి స్పామ్ వస్తున్నట్లు తెలిస్తే ఆ బ్లాగును వ్యాఖ్యల నుండి తప్పించడం జరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
మాలిక నియమాల్లో మార్పులు
ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...

-
సుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగ...
-
భాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల ...
-
మాలిక అగ్రిగేటర్ మొదలుపెట్టి ఈనాటికి వంద రోజులు. ఈ వంద రోజుల నుండి ఎన్నో ఆటుపోట్లతో, పొరపాట్లతో, కొన్ని కష్టాలతో మరికొన్ని నష్టాలతో ఇంకా మాల...
బ్లాగుల్లో వాతలు పెట్టుకునే నక్కలకు తక్కువలేదు. ఇది చూసి ఇంకో నలుగురు బ్లాగర్లు ఇదే బాట పట్టొచ్చు. అందుకే ఇక ఉపేక్షించదల్చుకోలేదు.
ReplyDeleteబ్లాగర్లను ఉద్దేశ్యించి వ్రాసినపుడు మరీ ఇంత కటువైన భాష ఉపయోగించడం సరి అయినదేనా ?
ఒక బ్లాగర్ తన బ్లాగుని అన్నిటికంటే పైన ఉంచాలని తాపత్రయపడుతున్నపుడు వారినుండి కొంత ధనాన్ని ప్రతిఫలంగా తీసుకోవచ్చు కదా ? ఫేస్ బుక్ లాంటివాళ్ళే ఆడ్స్ వేస్తున్నపుడు ఎవరూ అభ్యంతరం చెప్పనివాళ్ళు ఇపుడు అభ్యంతరం చెపుతారని అనుకోను.వాళ్ళు మనీ పే చేస్తున్నారేమో అని నేను అనుకున్నాను.జిలేబీ గారు చెప్పిన తరువాతే తెలిసింది. నాకయితే ఎటువంటి అభ్యంతరం లేదు.వాళ్ళు టాప్ పొజిషన్ లో బ్లాగ్ ఉంచినా మేము చదవాలి అనుకుంటే చదువుతాము కానీ ప్రతిదీ చదవము కదా ?
నీహారిక గారు... నేను కటువుగా రాసింది అందరు బ్లాగర్ల గురించి కాదు, ఇలా చేస్తున్న ఒకరిద్దరు బ్లాగర్ల గురించి అని గమనించాలి.
ReplyDeleteఅదీగాక నాకు ఎవరిని విమర్శించాలి అన్న ఉద్దేశం లేదు. కటువుగా ఉందంటున్నారు కాబట్టి మార్చడానికి అభ్యంతరం లేదు.
ప్రతి బ్లాగరు తమ బ్లాగు ఎక్కువ సేపు అందరికి కనబడాలనే కోరుకుంటారు. కానీ ఎప్పటికి మాలికలో వాళ్ల పోస్టులే పైన ఉండాలి అనుకోవడం మాత్రం సరికాదు. మీరన్నట్లు డబ్బులు తీసుకొని కొన్ని బ్లాగులను ప్రత్యేకంగా చూపించవచ్చు. కాని మాకు ఆ ఉద్దేశం లేదు, ప్రస్తుతానికి ఆ అవసరం కూడా లేదు.
మీరన్నట్లు చదవాలి అనుకున్న బ్లాగు పైన ఉన్న క్రింద ఉన్న చదివే వాళ్ళు తప్పకుండా వెదికి మరీ చదువుతారు. కాబట్టి పెనాల్టి విధానంతో బ్లాగర్లకు వచ్చే నష్టం కూడా ఏమీలేదు.
ReplyDeleteమీరే మాలిక అగ్రిగేటర్ ఓనర్ అనడాని "సాక్ష్యం" ఉందా :)
జిలేబి
హహ..ఏమీ లేదు. బైదవే, ఈ మధ్య పద్యాల మీద పగబట్టినట్లు ఉన్నారు.
ReplyDelete
Deleteఏదో మీ దయ మా ప్రాప్తం :)
కుశలమెల్లరు గదా ?
లక్కుపేట రాణి
చీర్స్
జిలేబి
వ్యాఖ్యలను పూర్తినిడివితో ప్రకటించకుండా మాలికలో కనిపించే నిడివిని కొన్ని పదాలకు పరిమితం చేయటం మంచిది. ఎక్కువ వ్యాఖ్యలకు చోటు దొరుకుతుంది.
ReplyDeleteఅలాగే ఒక బ్లాగుకు పరిమితసంఖ్యలోనే తాజావ్యాఖ్యలను చూపటం మంచిది. కొన్ని బ్లాగులు మాలికను వ్యాఖ్యలతో ముంచెత్తటం కొత్తవిషయం కాదు. లోగడ శంకరాభరణం బ్లాగు గురించి ఈ విషయంలో ఫిర్యాదు వచ్చింది కూడా. ఎందుకన్నో శంకరాభరణం వ్యాఖ్యలు కనిపించటం తగ్గింది. మళ్ళా పూర్తిస్థాయిలో మాలికవ్యాఖ్యలపేజీని ముంచెత్తుతున్నాయి. బ్లాగువారీగా చూపే వ్యాఖ్యలసంఖ్యపై పరిమితి వలన ఉపయోగం కలుగుతుంది.
ఒక వ్యాఖ్యాతనుండి కూడా పరిమిత సంఖ్యలోనే తాజావ్యాఖ్యలను చూపటం కూడా మంచిది. ఇందువలన వృత్తివ్యాఖ్యాతలకేమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉండవచ్చును కాని జనసాధారణానికి ఇబ్బంది లేదు. ముఖ్యంగా స్పామ్‍వ్యాఖ్యలకు అడ్డుకట్టవేసినట్లు అవుతుంది.
పరిమితకాలావధిని దాటిన వ్యాఖ్యలను మాలికచూపనవసరం లేదు. ఇదికూడా మాలికలో ఎక్కువ తాజావ్యాఖ్యలను చూపేందుకు దోహదం చేస్తుంది.
తెలుగులిపి బొత్తిగా వాడని వ్యాఖ్యలను గుర్తించటం సులభమే. అటువంటి వాటిని ప్రచురించవద్దు. దానివలన కూడా స్పామర్లను నిరోధించవచ్చును.
ఈ సూచనలు మీకు ఆమోదయోగ్యంగా ఉంటాయని ఆశిస్తున్నాను.
మీ సూచనలకు ధన్యవాదాలు.
ReplyDeleteప్రస్తుతం నిడివితో సంబంధం లేకుండా మొత్తం 100 (50+50) వ్యాఖ్యలు మాలికలో కనబడతాయి. నిడివి తగ్గించడంతో పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు.
గతంలో కొన్నాళ్లు మాలిక వ్యాఖ్యల విశయంలో కూడా పరిమితి ఉండేది. ప్రతి బ్లాగు నుండి కేవలం ఐదు తాజా వ్యాఖ్యలే మాలికలో కనబడేవి. కానీ ప్రస్తుతం బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసేవాళ్ళు వేళ్ల మీద లెక్కించేంత మందే కనబడతారు. ప్రతి టపాకు ఒకటి రెండు వ్యాఖ్యలు రావడమే గగనమై పోయింది. అలాంటప్పుడు ఈ పరిమితి ఎందుకని తీసేసాను.
ఒక వ్యాఖ్యాత నుండి పరిమిత సంఖ్యలో వ్యాఖ్యలు చూపడం అన్నది కూడా కాస్త ఆలోచించదగ్గ విశయమే. అయితే ఒక వ్యాఖ్యాత పది పదిహేను బ్లాగుల్లోకి వెళ్లి స్పందిచినప్పుడు కేవలం తాజా వ్యాఖ్యలే చూపిస్తే అతడు/ఆమె వ్యాఖ్యానించిన మిగతా బ్లాగులను నిర్లక్ష్యం చేసినట్టు అవుతుందేమో?
తాజా వ్యాఖ్యలు వచ్చినప్పుడు పాతవి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా కాలపరిమితి అంటు ఏమి పెట్టదల్చుకోలేదు.
తెలుగు లిపి లేని వ్యాఖ్యలను వడపోయొచ్చు అన్నారు. కాని చాల మంది ఇంగ్లీష్ లో కూడా చాల మంచి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వీటిని ఇంగ్లీష్ స్పామ్ నుండి విడదీయడానికి వీలుపడదు. వాకు తెలిసినంతలో స్పామ్‌కు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయగలిగింది బ్లాగు ఓనరు మాత్రమే.
శ్యామలీయం గారు చెప్పిన సూచనలను నేను కూడా అడుగుతున్నాను. ఒక బ్లాగునుండి పరిమిత వ్యాఖ్యలు,వ్యాక్యాలు అనుమతించి పుణ్యం మూట కట్టుకోండి.పద్యాల నుండి,చేట భారతాలనుండి బ్లాగర్లను రక్షించండి.జిలేబీ గారి మేధ నుండి ఒక్కొక్కసారి అద్భుతమైన ఇరకాటం ప్రశ్నలు వస్తుంటాయి.సామాన్యులు తట్టుకోవడం కష్టమే !
ReplyDeleteలోకనార(రి)దియే నమ:!
Deleteఏమడీ నీహారిక గారు
జిలేబి ప్రశ్నల నిడివి చిన్నవే కదండి ? అవి యెట్లా మోర్ స్పేస్ లాగేస్తాయి ?
జిలేబి
ReplyDeleteమీ ఆన్ లైన్ టెస్టింగ్ కి ఇంకా కామింట్లు వలయునా ?
లేక చాలా ?
౨_ మాలిక అగ్రిగేటర్ ఓనర్ కల్నల్ గారే అనడానకి "సాక్ష్యం" ఏదన్నా ఉందా అంటే లేదన్న ఏకలింగం వారి దగ్గర ఇన్నేసి సలహాలు వస్తున్నాయే యేమైనా తెలుగు బ్లాగు లోకపు వారి తెలివి ని మెచ్చు కోవాల్సిందే :)
జిలేబి
నూటికినూరు వ్యాఖ్యలూ చూపాలని నియమం పెట్టుకోవద్దండీ. అప్పుడు పాతబడ్డవ్యాఖ్యలు వదలకుండా వ్రేలాడే ఇబ్బంది ఉంది.
ReplyDeleteఎవరైనా వ్యఖ్యాత చాలా వ్యాఖ్యలు చేసినప్పుడు అన్నీ కనబడాలీ అనుకుంటే దానివలన ఒకలాభమూ ఒకనష్టమూ ఉన్నాయి. లాభం వ్యాఖ్యాతకే. నష్టం ఆ వ్యాఖ్యత ఒక స్పామర్ ఐతే మొత్తం బ్లాగులోకానికే. అటువంటి సందద్భాల్లో వారిని ఒక సప్లిమెంటరీ పేజీగా చూపవచ్చునా అన్నది ఆలోచించండి.
కొందరు ఆంగ్లంలో వ్యాఖ్యానిస్తూ మంచిసూచనలు ఇస్తూ ఉండవచ్చును. మంచిది. కాని తెలుగుబ్లాగుల్లో తెలుగులో ఎందుకు వ్యాఖ్యలు వ్రాయరు? తెలుగులో వ్రాయటం దాదాపు తప్పనిసరి చేయటం మంచిదే. ఆంగ్లమానసపుత్రుల్లా వ్యవహరించి బండినడిపించుకొనే వారిని ఎక్కువగా ప్రోత్సహించనక్కరలేదు. వారికి కొంత నిరుత్సాహం కలిగినా ఇబ్బంది లేదు. నేను తెలుగు చదవటానికి కూర్చున్నప్పుడు ఆంగ్లంలో వ్రాతలు చూడటం అస్సలు ఇష్టపడను. వృత్తిపరంగా రోజూ వందలపేజీలు ఇంగ్లీషులో చదివి తరిస్తున్నది చాలు లెండి.
స్పామర్లు జోరుగా చెత్తపంపుతూ ఉంటారు - వారికో వారితరపు వారికో మరింకేమీ పనిలేకపోవచ్చును. కాని ఎక్కువమంది బ్లాగర్లకు వృత్తిపరమైన జీవితం ఉంటుంది. ఎలాగో అలా వ్రాస్తున్నది చాలు - మళ్ళా వాళ్ళని నిరంతరం ఓ కన్నుపెట్టి మీ బ్లాగువ్యాఖ్యలను నిమిషాలమీద సరిచేస్తూ ఉండండి అంటే చాలామంది బ్లాగింగు మానుకోవలసి వస్తుంది!
ReplyDeleteకొత్త పంథా బాగు బాగు !
బ్లాగులో డెలీటైన కామ్ంట్లు మాలిక లోనూ హుష్ కాకి :)
చీర్స్
జిలేబి
ReplyDeleteమరో రెండు బగ్గులు ! వీలైతే సరి చేయండి
౧-> ఇది కంది శంకరయ్య వారు కనిబెట్టింది -> కామింటు కి రిప్లై ఆప్షన్ ఉపయోగించి కామింటితే ఒరిజినల్ కామింట్ మాలిక కామింట్ సెక్షన్ లో గాయబ్ :)
౨-> గూగల్ ప్లస్ ఎనేబుల్డ్ బ్లాగ్స్ కా మంటలు మాలిక కామింట్ల సెక్షన్ లో కనబడటం లేదు ( బ్లాగు అగ్రిగేటర్ లో కలుప బడి ఉన్నా ఉదాహరణ కి
http://golisastry.blogspot.com
cheers
జిలేబి