Monday 11 May 2020

మాలిక నియమాల్లో మార్పులు

ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే  ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది  నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్య అసభ్య వ్యాఖ్యల బెడద ఎక్కువై  పోతుంది. దీన్ని మా దృష్టికి తెచ్చిన అందరికి కృతఙ్ఞతలు. 

ఒకప్పుడు బ్లాగులు మంచి చర్చా వేదికలు. రాసేవాళ్ళు అలాగే చదివే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్లు. కానీ సోషల్ మీడియా వేదికలు ఎక్కువ కావడంతో బ్లాగుల పై ఆసక్తి తగ్గిపోయింది అన్నది నిజం. మళ్ళీ  ఆ ఆసక్తి గత ఒకటి రెండు సంవత్సరాలనుండి పెరుగుతుంది. ఇది ఒక శుభపరిణామం. 

మన బ్లాగుల్లో వ్యాఖ్యలకు, వ్యాఖ్యాతలకు  ఒక మంచి స్థానం, గుర్తింపు ఉన్నాయి. చాలాసార్లు బ్లాగరు రాసిన దానికంటే, కింద ఉన్న కామెంట్స్ నుండి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన  చర్చను ప్రతి బ్లాగరు కోరుకుంటారు.  కానీ కొంత మంది వ్యాఖ్యాతలు వాళ్ళ సహజ గుణం వాళ్ళ కానివ్వండి లేదా మరేదైనా కారణాల వాళ్ళ కానివ్వండి ఈ నడుమ వీలైనన్ని బ్లాగులలో దూరి బూతులతో  ప్రతాపం చూపిస్తున్నారు.  ఇలాంటి రాతలను బ్లాగులో  ఉంచుకోవాలా లేదా, అలాగే ఇలాంటి వ్యాఖ్యాతలను  అనుమతించాలా లేదా  అన్నది పూర్తిగా ఆ బ్లాగు ఓనర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటింది. మాలిక ఈ  విషయంలో 
ఎటువంటి జోక్యం చేసుకోదు, గతంలో కూడా ఎన్నడూ అలంటి పని చేయాలేదు. 

Maalika does not moderate the blog's comments. It is the responsibility of the blog owner. 

కానీ అగ్రిగేటర్ అడ్మిన్ గా మా సైటు ను శుభ్రంగా ఉంచుకోవాడం  మా బాధ్యత. అందువల్ల ఇకనుండి అసభ్య వ్యాఖ్యలను అనుమతించే బ్లాగులను మాలిక వ్యాఖ్యల పేజీ నుండి తాత్కాలికంగా తొలగించడం జరుగుతుంది.  బ్లాగు ఓనరు అసభ్య వ్యాఖ్యలను అనుమతించనని అంగీకరిస్తూ ఒక ఇమెయిల్ పంపితే ఆ బ్లాగు వ్యాఖ్యలను మాలిక పేజీలో చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 

అలాగే  మొన్ననే గూగుల్ వాడు ఓ ఉత్తరం పంపాడు. మీ సైట్లో సోషల్ ఇంజినీరింగ్ కంటెంట్ ఉన్నది దాన్ని తొలగించండి . లేకపోయితే మీకే కష్టం అని. 




ఇది ఎక్కడనుండి వచ్చిందని చుస్తే తేలిందేఏమిటంటే, కొన్ని బ్లాగుల్లో  వ్యాఖ్యలకు మాడరేషన్ లేకుండా వదిలివేయడం వాళ్ళ స్పామ్ కామెంట్లతో నిండిపోతున్నాయి. అప్పుడప్పుడు అవన్నీ మాలిక వ్యాఖ్యల పేజీ నిండా దర్శనం ఇస్తున్నాయి, అలాగే  ఎక్కడెక్కడి  వెబ్ సైట్లకో లింకులు తెస్తున్నాయి.  అందుకని ఇక నుండి స్పాం కామెంట్లను అనుమతించే బ్లాగులను కూడా వ్యాఖ్యల పేజీ నుండి తీసేస్తున్నాము. 
    
ఇక చివరగా, చాన్నాళ్లుగా పని ఒత్తిడి వాళ్ళ  బ్లాగులకు దూరంగా ఉండడం జరిగింది. చాల బ్లాగులను మాలికలో కలపమని ఇమెయిల్ పంపిన వాళ్లకు కూడా కాస్త ఆలస్యంగా స్పందించడం జరిగింది, క్షమించగలరు. ఐతే ఇప్పటి నుండి కొంచెం బ్లాగులకు కూడా సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తాను.

Let us meet on another blog. 

Happy blogging.




No comments:

Post a Comment

మాలిక నియమాల్లో మార్పులు

ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే  ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది  నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...