Tuesday 12 July 2016

మాలిక లో మార్పులు - 2

గత కొద్ది నెలల నుండి మాలికలో ఎప్పుడు ఒక బ్లాగరు పోస్టులే పైన ఉంటున్నాయి అని, అవి అన్ని రీసైక్లింగ్ చేసున్న పాత పోస్ట్ లు అని కొంత మంది బ్లాగర్లు ఈ-మేయిల్ పంపారు.  అందరికి ధన్యవాదాలు. 

మాలికలో బ్లాగుల వరుస క్రమం అనేది పోస్ట్ చేసిన తేది, సమయంను బట్టి ఉంటుంది. అయితే బ్లాగర్ లో ఒక సదుపాయం ఉంది. మనం పోస్ట్ చేసిన తేది, సమయం మార్చుకోవచ్చు. 

మాలిక ను తయారు చేస్తున్నప్పుడు నాముందున్న ఆప్షన్స్ రెండు. ఒకటి టపాను పొస్ట్ (published date) చేసిన సమయాన్ని ఆధారంగా వరుస క్రమం (sort) తయారు చేయడం, లేదా టపాను మొదలు పెట్టిన సమయాన్ని ఆధారంగ  (created date) వరుస క్రమాన్ని తయారు చేయడం.

టపాను మొదలు పెట్టిన సమయాన్ని తీసుకొని  వరుస క్రమం చేయడం వలన ఎవరైన టపా మొదలు పెట్టి దానిని డ్రాఫ్ట్ లా సేవ్ చేసి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పూర్తి చేసి పోస్ట్ చేస్తే అది మాలికలో ఆడుగున ఎక్కడో చేరిపోతుంది.  అందుకని నేను టపాను పోస్ట్ చేసిన సమయాన్ని వరుస క్రమం కోసం తీసుకోవడం జరిగింది.

గతంలో మాలిక మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టినప్పుడు ఎవరైనా పోస్ట్ చేసిన సమయం మారిస్తే వారికి ఈమేయిల్ పంపేవాడిని అలా చేయకండి, అని.  ఐతే గడిచిన కొద్ది నెలలుగా ఈ లొసుగును పట్టుకొని నెత్తినెక్కి కూర్చునే బ్లాగర్లు ఒకరిద్దరు తయారయ్యారు. బ్లాగుల్లో వాతలు పెట్టుకునే జనాలకు తక్కువలేదు. ఇది చూసి ఇంకో నలుగురు బ్లాగర్లు ఇదే బాట పట్టొచ్చు. అందుకే ఇక ఉపేక్షించదల్చుకోలేదు.  ఇక నుండి ఎవరైనా బ్లాగర్లు పోస్టుచేసిన సమయం మార్చి వరుస క్రమంలో ముందుకు రావడానికి ప్రయత్నించినట్లు తెలిస్తే వారి బ్లాగుకు పెనాల్టి పడుతుంది. అంటే వాళ్ళు ఏం పోస్టు చేసిన అవి మాలిక చివరిలోకి వెళ్ళి పోతాయి. బ్లాగర్లు అందరికి నిశ్పక్షపాతంగా మాలిక లో స్థానం కలిపించాలి అన్నదే ఉద్దేశం.

ఎవరి బ్లాగులైనా ప్రైవేట్ బ్లాగులుగా (invited users only) మారిస్తే వాటిని అగ్రిగేట్ చేయడానికి వీలుపడదు. అందుకని వాటిని మాలిక లో నుండి తప్పిస్తున్నాము. వీటిని అందరూ చదవడానికి అవకాశం కలిపించినప్పుడు మాలిక అడ్మిన్ కు తెలియజేయంది. తిరిగి మాలికలో కలపడానికి మాకు అభ్యంతరం లేదు. 
 
బ్లాగుల్లో వ్యాఖ్యలకు నియంత్రణ (moderation) పెట్టుకోవాల వద్దా అన్నది బ్లాగు ఓనర్ నిర్ణయం. అయితే కొన్ని నియంత్రణ లేని బ్లాగుల్లో స్పామర్ల్ ఇష్టం వచ్చిన చెత్త అంతా వ్యాఖ్యల రూపంలో నింపి పోతున్నారు. అది యధాతదంగా మాలికలో చేరి పోతుంది. ఒక్కోసారి వ్యాఖ్యల పేజీ మొత్తం ఇలాంటి చెత్తతో నిండి పోయిన సందర్భాలు ఉన్నాయి. వీటి నియంత్రణ బ్లాగు ఓనర్ల పని. ఇక నుండి బ్లాగుల్లో నుండి స్పామ్ వస్తున్నట్లు తెలిస్తే ఆ బ్లాగును వ్యాఖ్యల నుండి తప్పించడం జరుగుతుంది.

Friday 8 July 2016

మాలికలో కొన్ని మార్పులు

నమస్కారం.

మాలిక పుణ్యమా అని మళ్ళీ బ్లాగు తెరవాల్సి వచ్చింది. చాలా కాలం నుండి బ్లాగులకు దూరంగా ఉన్నా బ్లాగు ప్రపంచంలో జరుగుతున్నవి దూరం నుండి తెలుసుకుంటునే ఉన్నాను.  ఐతే ఇప్పుడు కాస్త దృష్టి పెట్టవలసిన విశయాలు మరియు చాలా రోజుల నుండి వాయిదా వేస్తూ వస్తున్నపనులు పేరుకు పోయి ఉండడంతో  మళ్ళీ ఇటు రావలసి వచ్చింది.


మొదట మాలిక లోని కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత కొత్తగా ఏమైనా మార్పులు చేర్చులు ఉంటే వాటిని చేపట్టడానికి ప్రయత్నిస్తాను.


ప్రస్తుతం చేస్తున్న మార్పుల గురించి మరో టపాలో...





మాలిక నియమాల్లో మార్పులు

ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే  ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది  నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...