ఎప్పటి నుండో చూద్దాం అనుకుంటున్న అవతార్ సినిమాకి టికెట్స్ ఈ వారం దొరకడంతో ఐమాక్స్ ౩డి లో నిన్నే ఈ సినిమా చూసాను. సినిమా నాకు నచ్చింది. స్థూలంగా నాకు అర్థం అయినంతలో కథేంటంటే..."పాండోరా ఉపగ్రహంపై ఉన్న విలువైన ఖనిజాన్ని (Unobtonium) త్రవ్వుకోడానికి ఒక కంపనీ (RDA) ప్రయత్నిస్తుంది. అయితే..వీరికి అడ్డంకిగా అక్కడే ప్రకృతిని ఆరాధిస్తూ నివసిస్తున్న నేటివ్ ప్రజలను (Na'vi) అక్కడ నుండి పంపేయాలి. అందులో భాగంగా మొదట అక్కడ ఉన్న ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకోవాలి. అక్కడ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవాలి, తర్వాత అక్కడి ఖనిజాన్ని సంపాదించుకోవాలి. పాండోరా మనుషుల జీవనానికి అనుకూలం కాదు, మనుషులు అక్కడ ఆక్సీజన్ లేకుండా బ్రతకలేరు కాబట్టి అక్కడి నేటివ్ ప్రజల దేహాలని, మానవుల DNA తో కలివి, నేటివ్ ప్రజల్లా అవతారాలను తయారు చేసి, ఈ అవతారాలను పాండోరా ప్రజల మధ్యకి పంపి, ప్రయోగశాల నుండి కంట్రోల్ చేస్తుంటారు. ఈ అవతారాల సాహాయంతో RDA కంపనీ పాండోరా పైన ఏంజేసింది, నావీలను అక్కడి నుండి పంపి విలులైన ఖనిజాన్ని స్వంతం చేసుకుందా లేదా అన్నది నేను చెప్పడం కంటే సినిమాలో చూస్తేనే బాగుంటుంది.
సినిమాలో సృష్టించిన "పాండోరా" ఒక అద్భుత లోకం. దట్టమైన అడవి. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ప్రజలు, విచిత్రమైన ఆచారాలు, వింత జీవులు, వాటితో అక్కడి ప్రజలకున్న అనుబంధం, రాకాసి పక్షులపై గగన విహారం, ఆకాశంలో తేలిపోయే పర్వతాలు, ఆ పర్వత చెరియల పైనుండి జలజలా రాలె సెలయేర్లు. ఇవన్నీ మనలోని ఊహలకు దృష్య రూపాలు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఒక కలల లోకాన్ని మన కళ్ళ ముందుకు తెస్తాయి. సరే... ఈ వర్ణనలాపి, నా ఇష్టాయిష్టాలు కాసేపలా పక్కకుబెట్టి అసలు విషయానికొద్దాం.
ఈ సినిమాపై చాలా మంది ఇప్పటికే చాలా విశ్లేషణ చేసారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పారు. ఎవరికి దొరికింది వాళ్ళు వెతుకున్నారు. నాకు మాత్రం ఈ సినిమా చూస్తున్నంత సేపు గుర్తుకొచ్చింది మన దేశంలో జరుగుతున్న అచ్చు ఇలాంటిదే ఒక సంఘటన. కాకపోతే ఈ సంఘటన అంతటి ప్రాముఖ్యత సంతరించుకోలేక పోవడానికి కారణం ఇది నిజ జీవితంలో జరుగుతున్న ఘటన, ఇందులో మనల్ను అబ్బుర పరిచే విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు. హీరో గారి వీరోచిత విన్యాసాలు ఉండవు. సినిమాలో పవిత్రమైన చెట్టును కాపాడుకోవాలనుకుంటే, ఇక్కడ ట్రైబల్స్ తము ఎంతో పవిత్రంగా పూజించే కొండను కాపాడుకోవాలనుకుంటున్నారు. సినిమాలో Unobtonium ఖనిజం కోసం ప్రకృతిని కొల్లగొట్టాలని చూస్తే, ఇక్కడ బాక్సైట్ కోసం ప్రకృతిని వికృతంగా మారుస్తున్నారు. సినిమాలో లాగే ఇక్కడా గిరిజనులు విల్లంబులు ఎక్కుపెట్టి మర తుపాకులను ఎదుర్కొంటున్నారు. సినిమాలో కంపనీ పేరు Resources Development Administration (RDA), మన నిజజీవితంలో కంపనీ పేరు వేదాంతా రిసోర్సెస్ (Vedanta resources).
బళ్ళారి "గాలి" సోదరులు "భూమి"ని త్రవ్వుకొని, "ఆకాశం"అంత ఎత్తుకెదిగి, కర్ణాటక ప్రభుత్వానికి "నిప్పం"టించి, బీజేపి అగ్రనాయకులకే "నీళ్ళు" త్రాగించారు. ఇప్పుడు అక్కడ నడుస్తున్న ప్రభుత్వ ప్రాణాలు కాపాడుతున్న పంచభుతాలు వీళ్ళే అని అందరికీ తెలుసు. ఈ గాలికుంటు వ్యాది సోకిన కర్ణాటక ప్రభుత్వం అప్పటి నుండి కుంటుకుంటూ నడుస్తుంది. ఈ కర్ణాటక నాటకాన్ని తిలకించిన వాళ్ళందరూ మైనింగ్ మాఫియా కర్ణాటక ప్రభుత్వాన్ని శాషిస్తుందని గగ్గోళు పెట్టారు. గాలి సోదరుల చేతిలో బీజేపి నాయకులు కీలు బొమ్మలయ్యారని అన్నారు. మరి ఇక్కడ లోకల్ గా ఒక 300 ఎకరాల్లో ఖనిజాన్ని త్రవ్వుకొని బ్రతికే వీళ్ళకే ఇంత బలం ఉంటే, మూడు దేశాల్లో మైనింగ్ చేస్తూ, 9 కంపనీల నడిపిస్తూ, 27,264 ఉద్యోగులతో, 37 వేల కోట్ల నికర సంవత్సర లాభంతో నడిచే కంపనీకి ఇంత ఎంత శక్తి ఉండాలి. మన భారత ప్రభుత్వానికి కూడా కొన్ని బడా కంపనీలు దిశా నిర్దేశం చేస్తున్నాయని ఎవరైనా అంటే అది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ అందులో కాస్తయినా నిజం లేక పోలేదు.
వేదాంత రిసోర్సెస్. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ (LSE) లో ట్రేడింగ్ చేసున్న కంపని. FTSE 100 లో ఒకటి. మార్కెట్ కాపిటల్ పరంగా LSE మైనింగ్ సెక్టార్లో ఎనిమిదవ అతిపెద్ద కంపెని. India, Zambia and Tasmania లో మైనింగ్ చేస్తుంది (ఇండియా లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకు వేదాంత పిల్ల కంపనీ Sterlite Industries గురించి తెలిసే ఉంటుంది). వీళ్ళకు ఒరిస్సాలో "నియమ్ గిరి" పర్వతంపై పుష్కలంగా ఉన్న బాక్సైట్ ఖనిజం కావాలి. కానీ అది అక్కడ నివసిస్తున్న డోంగ్రియా కోండ్ గిరిజనులకు పవిత్రమైన పర్వతం. సినిమాలో మాదిరిగానే ఈ కంపనీ వాళ్ళు గిరిజన అభివృద్ధి పేరుతో అక్కడికి రోడ్లు వేసారు. స్కూల్లు కట్టించించారు. వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించారు. ఇప్పుడు మెల్లిగా అక్కడ నుండి వాళ్లను సాగనంపడానికి తయారయ్యారు. దీనికి అక్కడి గిరిజనులు, పర్యవరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. సుప్రీంకోర్ట్ కు వెళ్ళారు. కానీ మన "భారత న్యాయస్థానం" ముందు ఎవరి వాదన పనిచేయలేదు.
వేదాంత ఇప్పుడీ కొండను తవ్వితోడుకోవడానికి సుప్రీంకోర్ట్ నుండి అనుమతి సంపాదించింది. డోంగ్రియా కోండ్ ప్రజలను అక్కడ నుండి తరిమేయడానికి రాజముద్రికతో వస్తుంది. ఇక వాళ్లకు ఆడ్డంగా మిగిలింది అక్కడ ఉంటున్న నక్సలైట్స్. వాళ్ళను ఈ అడవీ ప్రాంతం నుండి సాగనంగే పని మన హోం మంత్రి చిదంబరం చేపట్టాడు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు మీద నక్సలైట్లనీ, నక్సలైట్ల పేరు మీద అక్కడుంటున్న గిరి పుత్రులను తుపాకీ బెదిరింపులతో సాగనంపుతున్నారు. అక్కడ నుండి ఇప్పుడీ గిరిజనులను తరిమి ఆ ప్రాంతాం మొత్తాన్ని మైనింగ్ కంపనీలకు అప్పజెప్పడానికి, గన్ నీడలో గనులు త్రవ్వడానికి ఈ ఆపరెషన్ మొదలు పెట్టారు అన్నది చిదంబర రహస్యం. ఈ పనిపై చిదంబరానికు గల నిబద్ధతకు కారణం.. ఈయన గతంలో ఈ కంపనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక్కడు. 2003 వరకు ముంబై హై కోర్ట్ లో ఈ కంపనీ ప్రతినిధిగా హాజరయ్యాడు (Wikipedia).
అంతర్జాతీయంగా Survival International డోంగ్రియా కోండ్ గిరిజనుల తరుపున పోరాడుతుంది. వివిధ పర్యావరణ సంస్థల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తుంది. పర్యావరణవేత్తలు మన దేశంలో (BBC), లండన్ లో చాలా సార్లు London Stock Exchange ముందు Bank of England ముందు ప్రొటెస్ట్ చేసారు BBC). ఈ కంపనీ ట్రేడింగ్ ఆపేయమని, LSE నుండి డిలిస్ట్ చేయమని విజ్ఞప్తి చేసారు. కానీ ఇంగ్లాండ్ ప్రభుత్వం లెక్కజేయదు ఎందుకంటే...చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు ఈ కంపనీలో 4.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులున్నాయి (BBC. అది అప్పుడు. ప్రస్తుత పెట్టుబడుల విలువ 25 మిలియన్ డాలర్లు). ఒక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కే కాదు, ఇతర హెడ్జ్ ఫండ్ కంపనీలకు ఇందులో చాలా పెట్టుబడులున్నాయి. వాళ్ళకు ఇదో బంగారు గుడ్లు పెట్టే బాతు.
కుక్క కరిచిందని, పంది ప్రదక్షిణలు చేసిందని సంచలమైన వార్తలు ప్రసారం చేసి మెరుగైన సమాజం కోసం 24 గంటలు మొరిగే మన తెలుగు మీడియా ఇలాంటి విశయాల్లో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తాయి. ఈ విశయం పై తెలుగులో ఎక్కడా పెద్దగా వార్తలు వచ్చినట్లు నాకు కనబడలేదు. కేవలం ఆంధ్రజ్యోతిలో అల్లం నారాయణ గారు వ్రాసిన ప్రాణహితలో తప్ప.
వేదాంత గురించి చదివినప్పుడల్లా ఈ కంపనీ చేస్తున్న పని గురించి కొందరికైన చెప్పాలనిపించేది.ఇప్పుడు అవతార్ సినిమా మూలంగా ఈ విషయంపై రాయడానికి సందర్భం వచ్చింది.
- ఏకలింగం
Subscribe to:
Post Comments (Atom)
మాలిక నియమాల్లో మార్పులు
ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...
-
సుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగ...
-
తెలుగు బ్లాగుల కోసం ఒక వేగవంతమైన సంకలిని, "మాలిక" , మరియూ తెలుగు మైక్రో బ్లాగింగ్ సైట్ "కేక" ఈ రోజు నుండి పూర్తిస్థాయి...
-
భాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల ...
చదువు చెప్పించటం, మీకు నాగరికత నేర్పామనటం ఇటువంటి ఐడియాలను తెల్ల వాళ్ళు ప్రతి ఖండంలో శతాబ్దాల నుంచి అమలు చేశారు. మన తాతలకు ఉన్న జ్ఞానం వారికి 250 సం|| ఇప్పుడు కలిగినట్లుంది. వారి ఈ ఉద్దెశాన్ని తెల్ల వాడె బాగా బయట పెట్టాడు. ఇన్ని తెలిసి కూడా బ్లాగులో లోకం లో ఒక మేధావి తెల్ల వాళ్ళు రాసిన చరిత్రను గౌరవిస్తూ నిరంతరం ఒక వర్గం మీద దాడులకు దిగుతూండటం చాలా ఆశ్చర్యకరమైన విషయము.
ReplyDeletegood article boss.
ReplyDeleteసినేమా విజయం కోసం కాని, డబ్బుల కోసం సినేమా వాళ్ళు ఎప్పుడు ఒక పాసిటివె ఎండ్ తో ముగిస్తారు. అలాగే ఈ సినేమా లో కూడా హీరో బతికి నట్లు చూపించాడు. ప్రస్తుత మన పరిస్థికి ఈ సినేమా కధని అన్వ ఇస్థె మనం ప్రకృతిని దోచిపారేస్తున్నాము. అది ఊహించనత వేగం గా జరుగుతున్నాది, మనకు తెలిసి పండొరా లాంటి గ్రహం సుదూర దూరం లో లేదు. ఈ విధం గా మనం అభివృద్ది పేరు తో అరచుకుంటూ, ప్రకృతి ని దోచుకుంటూ పోతె మనిషి అనేవడు బతికి బట్టకట్టం అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరం ఎంత త్వరగా గ్రహిస్తె అంత మంచిది. ఈ రోజులలో ప్రతి ఒక్కరు తెల్ల వాడి మాటల మాయాజాలంలో పడి కెరీర్ అంటు, తను పని చేసే రంగం లో నెం1 గా ఉండాలన్ కుంటూ దానిని సాదించటానికి పిచ్చి వాళ్ళు అవుతున్నారు. ఈ పిచ్చి ఎలాగూ ఇప్పటి వారి కి తగదు కనుక కనీసం వచ్చె జనరేషన్ పిల్లల మీద మన పిచ్చి రుద్దకుండా ఉండటమే మన కర్తవ్యం.
ReplyDeleteబళ్ళారి "గాలి" సోదరులు "భూమి"ని త్రవ్వుకొని, "ఆకాశం"అంత ఎత్తుకెదిగి, కర్ణాటక ప్రభుత్వానికి "నిప్పం"టించి, బీజేపి అగ్రనాయకులకే "నీళ్ళు" త్రాగించారు. ఇప్పుడు అక్కడ నడుస్తున్న ప్రభుత్వ ప్రాణాలు కాపాడుతున్న పంచభుతాలు వీళ్ళే అని అందరికీ తెలుసు.
ReplyDelete-----------------
Superrrrrrrrr
This comment has been removed by a blog administrator.
ReplyDeleteహాల్లో,మిత్రమా!నమస్తే!చాలా బాగా రాసవు .అభినందిస్తున్నాను .నీ బ్లాగ్ రెగ్యులర్గా ఫోలో అవుటను ఇకనుండి .
ReplyDelete@ మొదటి, మూడవ అజ్ఞాతలు...
ReplyDeleteమీరు చెప్పింది కొంత అర్థం అయింది. కొంత అర్థం కాలేదు.
"బ్లాగులో లోకం లో ఒక మేధావి తెల్ల వాళ్ళు రాసిన చరిత్రను గౌరవిస్తూ నిరంతరం ఒక వర్గం మీద దాడులకు దిగుతూండటం చాలా ఆశ్చర్యకరమైన విషయము."
ఇది ఎవరినుద్దేశించో నాకు తెలీదు.
@ బుడుగు..
కృతజ్ఞతలు.
@ తెలుగు బ్లాగ్ సింహం..
ఇదేదో కొత్త గొడవలా ఉంది... ఆయన బ్లాగులోనే కామెంటక పోయారా?
@ వీరగోని.
కృతజ్ఞతలు.
"బ్లాగులో లోకం లో ఒక మేధావి తెల్ల వాళ్ళు రాసిన చరిత్రను గౌరవిస్తూ నిరంతరం ఒక వర్గం మీద దాడులకు దిగుతూండటం చాలా ఆశ్చర్యకరమైన విషయము."
ReplyDeleteఇది ఎవరినుద్దేశించో నాకు తెలీదు.
----------------------
బహుశ చదువుకున్నా uneducated గా మిగిలి పోయిన ఒక "కత్తి"లాంటి బ్లాగర్ గురించి అయ్యుండచ్చు.
పంచభూతాల వాక్యం బాగుంది.
చాలా మంచి విషయం రాశారు ఏకలింగం గారు. మన మీడియా కూడా అమెరికన్ మీడియాలా తయారయ్యింది. దేని గురించి రాయాలో దాని గురించి రాయరు. "మెరుగైన సమాజం" కొరకు ఎక్కడెక్కడో ఉన్న చెత్తనూ పోగేసుకు వచ్చి నడింట్లో గుమ్మరిస్తారు. చానెళ్ళ ప్రసారాలపై మొన్నటి హైకోర్టు తీర్పు ఒక గొప్ప ఊరట.
ReplyDelete"బ్లాగులో లోకం లో ఒక మేధావి తెల్ల వాళ్ళు రాసిన చరిత్రను గౌరవిస్తూ నిరంతరం ఒక వర్గం మీద దాడులకు దిగుతూండటం చాలా ఆశ్చర్యకరమైన విషయము."
ReplyDelete''taadepalli''
Church of England sells Vedanta shares over Orissa human rights
ReplyDeleteLondon, Feb 6 (IANS) In a major victory for human rights campaigners, the Church of England Friday sold off its shares, worth 3.75 million pounds, in the Indian-owned mining company Vedanta Resources, saying it was "not satisfied" with the company's human rights records in Orissa.
"After six months of engagement, we are not satisfied that Vedanta has shown, or is likely in future to show, the level of respect for human rights and local communities that we expect of companies in whom the Church investing bodies hold shares," said John Reynolds, chairman of the church's Ethical Investment Advisory Group.
"We respect the Indian democratic system. Our concern is that a company registered and listed in the UK should conform to the established environmental, social and governance norms expected in the London market - or at least reassure its shareholders that it is committed to the journey," Reynolds said.
A Church of England spokesman said two Church establishments held shares in the FTSE 100-listed company - the Church Commissioners held about 3.25 million pounds while the Church of England Pensions Board had shares worth half a million pounds.
Stephen Corry, director of the nongovernment organisation Survival International, said "The Church's unprecedented and very welcome decision sends a strong signal to companies that trample on tribal peoples' rights: we will not bankroll your abuses. Anybody who has shares in Vedanta should sell them today if they care about human rights."
Survival accuses Vedanta, owned by the Indian-origin billionaire Anil Agarwal, of flouting the human and cultural rights of tribals at two locations in Orissa - an alumina refinery in Lanjigarh and a planned bauxite mine in the Niyamgiri hills.
The Dongria Kondh tribe considers Nyamgiri to be a sacred mountain.
Vedanta said in a statement it was "disappointed" by the decision.
"We are disappointed by the Church of England's decision to sell their holding in Vedanta. Vedanta remains fully committed to pursuing its investments in a responsible manner, respecting the environment and human rights," the company said.
"We work with a number of NGOs and with the authorities in India, the world's largest democracy, ensuring all our projects are conducted in compliance with the law and international best practice. We will continue to engage closely with the Church of England to address the concerns they have raised," it added.
Last year Vedanta was publicly rebuked by the British government for failing to respect the human rights of the Dongria Kondh, saying "a change in the company's behaviour" was "essential".
The Norwegian government sold its $13 million stake in Vedanta in 2007, while Martin Currie Investments sold their 2.3 million pound stake last year, and BP's pension fund reduced its holdings due to "concerns about the way the company operates".
Survival said it is continuing to lobby other shareholders, including the Rowntree Foundation, a British charity.
నేను మీ బ్లాగ్ ని గూగుల్ రీడర్ నుంచి చదువుతుంటాను.
ReplyDeleteఅక్కడ పూర్తిగా చదవడానికి మీరు పర్మిషన్ ఇవ్వలేదనుకుంటా
సెట్టింగ్=> సైట్ ఫీడ్ => allow బ్లాగ్ ఫీడ్ అని ఉంటుంది కదా అక్కడ ఫుల్ అని ఇస్తే నేను రీడర్ లో చదువుకుంటాను
వాడెవడో నా గురించి వ్రాసిన సందర్భం లేని కామెంట్ ని తొలగించగలరు
అప్పారావు శాస్త్రి
@ అప్పారావు శాస్త్రి,
ReplyDeleteగూగుల్ రీడర్ లో ఈ బ్లాగు స్నిప్పెట్స్ మాత్రమే వస్తాయి. పూర్తి టపాలు రావు. పూర్తి టపాలకు పర్మిషన్ ఇస్తే నేను ఇక్కడి నుండి తొలిగించిన పాత టపాలు కూడా పూర్తిగా వస్తాయి. కానీ వాటి అవసరం ఇప్పుడు లేదని వాటిని ఇక్కడి నుండి తొలిగించాను. పర్మిషన్ కూడా తీసేసాను. సారీ... నేను వాటికి పర్మిషన్ ఇవ్వలేను.
మీ గురించి "తెలుగు బ్లాగ్ సింహం" రాసిన కామెంట్ తొలిగించాను.