మాలిక అగ్రిగేటర్ మొదలుపెట్టి ఈనాటికి వంద రోజులు.
ఈ వంద రోజుల నుండి ఎన్నో ఆటుపోట్లతో, పొరపాట్లతో, కొన్ని కష్టాలతో మరికొన్ని నష్టాలతో ఇంకా మాలిక ముందుకు వెళుతూనే ఉంది.
కొంత మందికి కుతూహలం... ఇది ఎవరు పెట్టారని. కొందరు పెద్దమనుషుల ఆరోపణల... ఒక బ్లాగర్ను(?) ఒక సంకలినిని నుండి తొలగించినందుకే మాలికలల్లారని. మరి కొంత మందికి సంతోషం ఈ అగ్రిగేటర్లో వాళ్ళేం వ్రాసినా (బూతులు కానంత వరకు) వాళ్ళ బ్లాగును తొలగిస్తామని బెదిరింపులు ఉండవని.
ఈ శతదినోత్సవం సందర్భంగా మాలిక పుట్టుపూర్వోత్తరాలు, కష్టాలు, బాలారిష్టాలే కాకుండా ఉప్పొంగాలనుకున్న కడలి మాలికలా మారిన వైనం...వగైరా వగైరా మీతో పంచుకోవాలనుకుంటున్నాము.
రేపటి టపాలో మాలిక మొదలు పెట్టడానికి కారణాలు, మేము పడ్డ ఇబ్బందులు, మరియు ఎల్లుండి టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా ఉంటుందో/ఎలా ఉండదో చదవండి.
మాలికను ఇంతలా ఆదరించిన/ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు.
Tuesday, 27 July 2010
Friday, 4 June 2010
నేన్నేర్చుకున్న బ్లాగు పాఠాలు: బ్లాగుల్లో భాషా బానిసత్వము
భాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్న పదాలు ఇప్పుడు పుస్తకాలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు వాడుకలో ఉన్న పదాలు రేప్పొద్దున కనబడకుండా పోతాయి. దాన్నెవ్వరూ ఆపలేరు.
ఇంటర్‌నెట్, కంప్యూటర్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఇలాంటి పదాలకు తెలుగులో సరి సమానమైన పదాలు లేవు. ఆ మాటకొస్తే, ఇప్పుడు వాడుతున్న అర్థంతో ఏ భాషలోను ఆ పదాలకు సరిసమానమైన పదాలు లేవేమో? కానీ ఇప్పుడు ఈ పదలు వాడుకలోకి వచ్చాయి. ఈ మాటలకు అర్థం ఏమిటో ఇంచుమించు చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.
వాడుక భాషతో, రోజూ వాడుకునే పదాలతో రాసిన సొగసు ఇంకే విధంగా వ్రాసినా రాదని నేననుకుంటాను. ఈరోజు వాడుకలోకి వచ్చి అందరి నోళ్ళళ్ళో నానుతున్న పదాలు తెలుగు పదాలే కావలసిన అవసరం లేదు. ఏ భాష పదమైన కావచ్చు. ఏ భాషకు చెందని పదమూ కావచ్చు. ఒక వేళ అది తెలుగు పదం కాకపోతే, ప్రతి పదానికి ఖచ్చితంగా ఒక తెలుగు పదం ఉండి తీరాల్సిందే అని పంతానికి పోయి దొరికిన ప్రతి ఇంగ్లీష్/పరభాషా పదానికి ఒక సరిసమానమైన పదం వెతికి/సృష్టించి, వాడడం మొదలు పెట్టి అదే భాషోద్ధారణ అనుకోవడం నాకు బ్లాగుల్లో కనిపించింది.
ఈ పద సృష్టి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. క్రింద పేర్కొన్న ఈ పదాలు నా సొంత కవిత్వం కాదు. నేను ఇక్కడ చూసిన, వాడుకలో ఉన్న కొన్ని పదాలను మాత్రమే ఇస్తున్నాను.
Net: జాలం
Internet: అంతర్జాలం
Mouse: ఎలుక, మూషికం
Computer: సంగణకం
Hard disc: దృడ పళ్ళెం.
Hardware: గట్టి సామాను.
Software: మెత్తటి సామాను
Credit card: ఋణ రేకు
Firefox: మంట నక్క
Open Source: బహిరంగాక
Browser: విహారిణి
Laptop: అంకోపరి
Download: దింపుకోవడం
Install: స్థాపించుకోవడం
Hits: నొక్కులు
Links: లంకెలు
Post, Comments, Cut, Copy, Paste etc...
మొదట ఈ పదాలు విని ఏదో కామెడికి ఇలా చేసారేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది. భాషాసేవలో, పదసృష్టిలో ఇవి ఓ భాగమని. నలుగురితో నారాయణ అనుకుంటూ ఇందులోని కొన్ని పదాలు నేనూ వాడాను. కానీ ప్రతిసారీ అనిపించేది. ఇలా వాడడం అవసరమా అని.
మన గ్రంథసాంగులు అలమారా గూళ్ళలోని, ఇనప పెట్టెల్లోని నిఘంటువులకు దుమ్ముదులిపి పదానికి పదం కలిపి సగటు బ్లాగరుకు వెగటు పుట్టించేలా తయారు చేసిన/చేస్తున్న ఈ ఆర్భాట పదకోశం ఎంత మందికి ఉపయోగపడుతుంది. ఈ పదాల వెతుకులాటనే మనం చేసే భాషాసేవా? ఈ చిందరవందర గందరగోళం ఎందుకు?
Post ను తెలుగులో ఏమని పిలుద్దాం. జాబు? ఉత్తరం? లేఖ? టపా? అన్ని వాడదాం పోయేదేముంది అంటారా? రేపో గీర్వాణ శిరోమణి వచ్చి "మంట నక్క" అంటే మరీ తేలికగా ఉందని పదంలో weight లేదని "జ్వాలాజంబుకం" అని పాండిత్యం ప్రదర్శిస్తే అప్పుడు మళ్ళీ దాన్ని మోసుకొని తిరుగుదామా? మౌస్ చిన్నగా ఉంటే చుంచెలుక అని, పెద్దగా ఉంటే పందికొక్కు అని అనుకుందామా? "సంకనాకం" అనేది గజడదవాదేశ సంధి ప్రకారం సంగణకం అవుతుందన్నమాట... అని మరో భాషావేత్త వ్యాకరణ పాఠాలు చెప్పడని గ్యారంటి ఏమిటి?
ఇప్పుడు చేసిన ఈ ట్రాన్స్‌లేషన్‌లు కొంత కాలానికి రివర్స్ ట్రాన్స్‌లేషన్ కాకుండా పోవు. దీనికి సంబంధించి ఒక సంఘటన గుర్తుచేసుకుందాం. ఈ కథ నార్త్ చెన్నై పట్టణంలో ఉన్న బార్బర్స్ బ్రిడ్జ్ గురించి. మెదట దీనిపేరు Hamilton Bridge గా ఉండేదట. అయితే, దాన్ని పలకడానికి సులువుగా ఉంటుందని, ఇంగ్లీష్‌లో బాగాలేదు "తమిళీకరిస్తే" భేషుగ్గా ఉంటుందనుకొని కొందరు ఔత్సాహికులు Ambattan vaaravathi (Hamilton -> Ambattan అని Bridge -> vaaravathi) అని సగంసగం ట్రాన్స్‌లేషన్ చేసి ఒదిలి పెట్టారట. కానీ ఆ తర్వాత మొదలైంది అసలుకథ. తమిళంలో Ambattan అంటే మంగలి అని అర్థం. కొన్నిరోజుల తర్వాత కొందరు చదువుకున్న వాళ్ళు ఇంతమంచి బ్రిడ్జ్‌ని ఇలా తమిళంలో మంగలి పేరుతో పిల్చుకోవడం ఏంటి? అని నొచ్చుకొని మళ్ళీ దాన్ని ఇంగ్లీష్‌లోకి మార్చేసి Barber’s Bridge చేసేసారు. ఇలా భాషవేత్తల తలతిక్క తర్జుమాలా మూలంగా Hamilton Bridge కాస్తా Barber’s Bridge అయి కూర్చుంది. ఈ ప్రాప్తం కంప్యూటర్ భాషకు పట్టదన్న భరోసా లేదు.
Shakespeare అనేది Shake spear కు రూపాంతరం అని "కదిలే బరిసే" అని తెలుగీకరించి సంబరపడదాం (దీనిపై ఇంకా ఎక్కువ ఈకలు పీకితే బూతవుతుందేమో అని భయంగా ఉంది). అమెరికా మాజీ వైస్‌ప్రెసిడెంట్ Dick Cheney పేరును కూడా పదానికి పదం కలిపి కదం తొక్కిద్దాం (అది ఎలా తయారైనా మనకు సంబంధం లేదు).
ప్రస్తుతం మన బ్లాగుల్లో మాత్రం ఇంగ్లీష్‌ను వ్యతిరేకించడమే తెలుగు భాషను గౌరవించడం అన్నట్లు తయారయింది. వాడుక మాటలు వాడినంత మాత్రాన తెలుగు భాషకు తీరని ద్రోహం చేసినవారమైపోతామా? ఇక్కడ మనం భాషను భ్రష్టుపట్టించాలని ఈ పదాలు వాడడం లేదు. ఎదుటివారికి సులభంగా అర్థం అవుతుందన్న భావన తోనే వాడుతున్నాము కదా. అవసరమైనప్పుడు మిగతా భాషలను వాడుకుంటూ తెలుగును గౌరవించుకోలేమా?
పదనిర్మాణం తో పాండిత్యం చూపించడం వల్ల ఉపయోగం ఉందా? ఓ పది కొత్త పదాలు సృష్టించి, పదిమంది చేత వాటిని పలికించడమే తెలుగుకు మనం చేసే సేవా? కొత్తపదాలు పుట్టించడంలో తప్పేముంది... ఏమి లేదు, కానీ ఇలా పదానికి పదం కలిపి కొత్త పదాలు సృష్టించడం కంటే, మౌస్‌ను "సూచీ" అని హార్డ్‌డిస్క్‌ను "భండాగారం" అని ఇలా "సమభావ" పదాలు వాడుకోవచ్చు కదాని ఎక్కడో ఇంతకు ముందు చర్చలో చదివిన గుర్తు. అది కొంచెం అర్థవంతమైన వాదనలా అనిపించింది.
బ్లాగుల్లో ఉన్న భాషాభిమానులు మరొక్కసారి ఆలోచిస్తారనే అనుకుంటున్నాను. నేనెవరినీ ఇలా ఉండాలి అని చెప్పడం లేదు. ఎవరి క్రియేటివిటి వాళ్ళది. ఎవరు ఏ పదాన్నైన పుట్టించొచ్చు. వాడొచ్చు. నేనేమీ భాషోద్ధారకున్ని కాదు. పైన చెప్పిన పదలు ఎవరు వాడినా వాడకపోయినా నాకు వచ్చేదిలేదు, పోయేదిలేదు. కానీ పరయివాడు నోటికొచ్చినట్లు ఏది పలికినా మనం మక్కికి మక్కి పదాలు కలిపి చంకలుగుద్దుకొని సంబరపడిపోయే "భాషా బానిసత్వం" నుండి బయటపడే ప్రయత్నం ఎందుకు చేయొద్దనే అలోచన మాత్రమే.

Thursday, 3 June 2010
నేన్నేర్చుకున్న బ్లాగు పాఠాలు: బ్లాగు భాష
సుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగిన ఇక్కడ బ్లాగుల్లో చర్చించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, వీలైతే అప్పుడప్పుడు పోట్లాడుకోవడం... ఇవన్నీ చూసి అర్రే, ఇప్పటికే మనం చాలా మిస్సయ్యాం కదా అనిపించింది. వీటన్నింటిలో వింతగా అనిపించింది మాత్రం ఇక్కడి భాష. బ్లాగులు చదవడం అలవాటు లేని నాకు ఇక్కడ భాష కొంచెం తేడాగా కనబడింది/కనబడుతుంది.
టపాలు, స్పందనలు, వ్యాఖ్యలు, లంకెలు, నొక్కులు, అంకోపరి, మూషికం, కవిలే, కైఫీయతు, ప్రవరా, జాలం, అంతర్జాలం, విహారిణి, బహిరంగాకర, సంగణకం, చిరునామా పెట్టె, స్థాపించుకోవడం, ముఖ పత్రం, దింపుకోవడం, వేగు పదం, నెనర్లు..... నా బొంద... నా బొచ్చె.
నేను కూడా బ్లాగు వ్రాయడం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇలా వ్రాస్తేనే తెలుగులో వ్రాసినట్టేమో, లేక పోతే లేదేమో అని భయంగా ఉండేది. ఇందులో కొన్ని వాడుకలో లేని పాత పదాలైతే మరికొన్ని మాత్రం ఇప్పుడే పుట్టించిన సరికొత్త పదాలు. ఈ పాత పదాల్లో కొన్నింటిని అప్పుడో ఇప్పుడో చదివాను, కొత్త పదాల్లో కొన్నింటిని కొంచెం కష్టపడి అర్థం చేసుకున్నాను. అయితే వీటన్నింటిలో ఎక్కువగా తికమక పెట్టింది.. "నెనర్లు".
పెసర్లు, బొబ్బర్లు, కామెర్లు, గోమార్లు ఈ పదాలు విన్నాను. నెనరు లేని పుట్టుక, నెనరు లేని బ్రతుకు... ఇలాంటి తిట్లు తెలంగాణాలో చాలా సార్లు విన్నాను. కానీ నెనర్లు అని ఎక్కడా వినలేదు. తర్వాత తర్వాత నా మట్టిబుర్రకు తెలిసిందేమిటంటే ఇది ఇక్కడ బ్లాగు భాషా పండితుల పైత్యం వలన పుట్టుకొచ్చిన పదమని. ఇంతకుముందు ఎక్కడా లేదని.
ఇలా ఎవరైనా గట్టిగా అన్నారనుకో వాళ్ళ పైకి మన బ్లాగు భాషా పరిరక్షకులు గయ్యిమని ఇంతెత్తున లేచి, ఓ పాత తాళపత్ర గ్రంథం దుమ్ము మన మోహన దులుపి, మనకు అర్థంగాని పద్యం ఒకటి దరువెత్తుకొని, మన చెవులు అదిరిపోయేలా రాగందీసి, విన్నావా అహ..విన్నావా ఇది...మన శాస్త్రాలు ఏమని ఘోషిస్తున్నాయో... నెనరు అంటే కృతజ్ఞత, కాబట్టి నెనర్లు అంటే కృతజ్ఞతలు అని మనకో తెలుగు పాఠం చెప్తారు.
అయ్యా, కొన్నింటికి బహువచనాలు ఉండవేమో? నా విశ్వాసం అంటాం కానీ, నా విశ్వాసంలు అనం కాదా? అని పొరపాటున మీరేమైన అన్నారే అనుకో, ఛత్...నీకేం తెలుసు? నే పట్టిన ఉడతకు మూడే కాళ్ళు అని బిర్రబిగుసుకు కూర్చుంటారు.
అంతటితో ఊరుకుంటారా అంటే...అదీ లేదు. ప్రొద్దున్నే అడ్డమీద కూర్చొని, కనబడ్డ ప్రతి బ్లాగుకు వెళ్ళి, వీళ్ళ పైత్యం ప్రదర్శించి, ఇలాంటివి ఓ రెండు మూడు పదాలు వాళ్ళ బ్లాగులో అతికిస్తారు. వీళ్ళతో మనకెందుకని మిగతా బ్లాగర్లంతా ఈ "అచ్చతెలుగు పదాలను" ఊరంతా తిరిగి పళ్ళో అని అమ్ముకొని వస్తారు. ఇంకేం ఉంది. కొన్ని రోజులకు ఇవే ప్రామాణిక పదాలయి బ్లాగుల్లో రాజ్యమేలుతయి.
"బ్లాగు"ను "తెలుగీకరించలేరు" కాబట్టి కిక్కురుమనకుండా అలాగే వాడుతున్నారు. లేకుంటే దాన్ని కూడా ఓ ఆటడుకునే వాళ్లేమో అనిపించింది.
ఈ పదాలేమైనా ప్రింట్ మీడియాలో కనబడతాయా ఆంటే, అప్పుడో ఇప్పుడో వీళ్ళు వ్రాసిన ఆర్టికల్స్ బ్రతిమిలాడి బల్మీటికి ప్రచురించుకున్న దాంట్లో తప్ప ఎక్కడా కనబడవు. పోనీ ఈ తామరతంపర ఒకాబులరినీ వీళ్ళ బయట ప్రపంచంలో వాడుతారా అంటే అదీ లేదు. బయటకోస్తే అంతా పాష్ ఇంగ్లీష్. వీళ్ళకూ తెలుసు బ్లాగుల్ల్లో రాసే పదాలు బయట వాడితే వీళ్ళను పిచ్చోళ్లల చూస్తారని. మరి ఈ పదాలు ఎందుకయ్యా అంటే, బ్లాగుల్లో తమ పాండిత్యం ప్రదర్శించుకోడానికని నాకు తర్వాత తలకెక్కింది.
ఈ పిచ్చికి నవ్వుకుని మొన్నో తెలుగు పేపర్లో అంతర్జాలం అంటే మార్జాలంలా ఉందని దెప్పి పొడిచారు కూడా. అయినా బ్లాగుల్లో బ్రతుకుతున్న మనకు ఈ ఈసడింపులు, దెప్పిపొడుపులు కొత్తా చెప్పండి. భాషను ఉద్ధరించడానికి పూనుకున్న తర్వాత ఇవన్నీ పట్టించుకోవద్దు.
నేను కూడ తెలుగు భాషను రక్షించడానికి కృషిచేద్దాం అని డిసైడ్ అయొపోయా. మీరు కూడా తలా ఓ చెయ్యేంయ్యండి. భాషోద్దరణలో భాగంగా కొత్త పదాలను సృష్టిద్దాం. దుమ్ముపట్టుకు పోయిన పదలను మళ్ళీ వెలుగులోకి తెద్దాం. పదం ఎంత పాతదైతే మన పాండిత్యం అంత గొప్పగా కనబడుతుంది. ఈ కొత్త పదాలు ఎవరు వాడుతారు అన్న సంశయం మీకొద్దు. ఓ పది బ్లాగులు తిరిగి ఇరవై సార్లు అతికించి వస్తే చచ్చినట్లు వాళ్ళే వాడడం మొదలు పెడతారు. ఏమంటారు?
బ్లాగు లోకంలో ఎప్పుడు కొత్తపదాలు పుడుతాయో, ఎప్పుడు కొత్త ఆచారాలు మొదలైతాయో ఎవరూ చెప్పలేరు. అంచేత... రోజు మూషిక వాహనం ఎక్కి (అనగా మౌస్ చేతబట్టుకొని... అని కవి హృదయం) "అంతర్జాలంలో", "విశ్వవ్యాప్త వలయంలో" ఏడేడు లోకాలు తిరిగొచ్చే సంగణకనాథులమైన మనం గణనాథునికి ఎందులోను తీసిపోము. అంతేకాదు, ఓ మూడు సార్లు భూమిచుట్టూ తిరగరావడానికే బద్దకించి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి పనైయిందనిపించుకున్న గణపతికంటే మనమే ఓ మెట్టు పైనున్నాము. కాబట్టి కంప్యూటర్ వాడుకదార్లమంతా ఓ తొండం కూడా పెట్టుకొని తిరిగితే బాగుంటుందేమో అని ఎవరైనా విజ్ఞులు ఓ లాజికల్ పాయింట్ తీసుకొని రాగలరు. కావున దానికి కూడా సిద్ధంగా ఉందాం.
-ఏకలింగం

Monday, 19 April 2010
మాలిక: "The quickest aggregator of Telugu blogs" released
తెలుగు బ్లాగుల కోసం ఒక వేగవంతమైన సంకలిని, "మాలిక", మరియూ తెలుగు మైక్రో బ్లాగింగ్ సైట్ "కేక" ఈ రోజు నుండి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. ప్రస్తుతానికి రెగ్యులర్ గా కనబడే కొన్ని బ్లాగులను మాలికలో కలిపాము. ముందుముందు అన్ని బ్లాగులు మాలికలో చేరుస్తాము. కొన్ని రోజుల తర్వాత ఫోటోబ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తలు...వగైరా, వగైరా అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుతం ఉన్నటువంటి ఏ సంకలినికి లేని వేగం మాలిక సొంతం. మీరు టపా రాసినా, కామెంట్ రాసిన అది ఐదు నిమిషాల లోపే అందరితో పంచుకోబడుతుంది. ఎన్నిబ్లాగులొచ్చినా, ఈ వేగాన్ని ఇలాగే కొనసాగించడానికి మాలిక ప్రయత్నిస్తుంది.
ముఖ్యవిశయం: మీ బ్లాగు స్వేచ్చని మాలిక ఎప్పుడు గౌరవిస్తుంది. మీ బ్లాగు గొడవల్లో మాలిక ఎన్నడూ తలదూర్చదు. నిరంకుశంగా మీ గొంతునొక్కే ప్రయత్నం ఎన్నడూ చేయదు. స్వేచ్చగా మీ భావాలు పంచుకోండి.
Team: RK, Vimal, Bharadwaj, Ekalingam

Monday, 18 January 2010
Indian Avatars: డోంగ్రియా కోండ్ గిరిజనులు
ఎప్పటి నుండో చూద్దాం అనుకుంటున్న అవతార్ సినిమాకి టికెట్స్ ఈ వారం దొరకడంతో ఐమాక్స్ ౩డి లో నిన్నే ఈ సినిమా చూసాను. సినిమా నాకు నచ్చింది. స్థూలంగా నాకు అర్థం అయినంతలో కథేంటంటే..."పాండోరా ఉపగ్రహంపై ఉన్న విలువైన ఖనిజాన్ని (Unobtonium) త్రవ్వుకోడానికి ఒక కంపనీ (RDA) ప్రయత్నిస్తుంది. అయితే..వీరికి అడ్డంకిగా అక్కడే ప్రకృతిని ఆరాధిస్తూ నివసిస్తున్న నేటివ్ ప్రజలను (Na'vi) అక్కడ నుండి పంపేయాలి. అందులో భాగంగా మొదట అక్కడ ఉన్న ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకోవాలి. అక్కడ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవాలి, తర్వాత అక్కడి ఖనిజాన్ని సంపాదించుకోవాలి. పాండోరా మనుషుల జీవనానికి అనుకూలం కాదు, మనుషులు అక్కడ ఆక్సీజన్ లేకుండా బ్రతకలేరు కాబట్టి అక్కడి నేటివ్ ప్రజల దేహాలని, మానవుల DNA తో కలివి, నేటివ్ ప్రజల్లా అవతారాలను తయారు చేసి, ఈ అవతారాలను పాండోరా ప్రజల మధ్యకి పంపి, ప్రయోగశాల నుండి కంట్రోల్ చేస్తుంటారు. ఈ అవతారాల సాహాయంతో RDA కంపనీ పాండోరా పైన ఏంజేసింది, నావీలను అక్కడి నుండి పంపి విలులైన ఖనిజాన్ని స్వంతం చేసుకుందా లేదా అన్నది నేను చెప్పడం కంటే సినిమాలో చూస్తేనే బాగుంటుంది.
సినిమాలో సృష్టించిన "పాండోరా" ఒక అద్భుత లోకం. దట్టమైన అడవి. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ప్రజలు, విచిత్రమైన ఆచారాలు, వింత జీవులు, వాటితో అక్కడి ప్రజలకున్న అనుబంధం, రాకాసి పక్షులపై గగన విహారం, ఆకాశంలో తేలిపోయే పర్వతాలు, ఆ పర్వత చెరియల పైనుండి జలజలా రాలె సెలయేర్లు. ఇవన్నీ మనలోని ఊహలకు దృష్య రూపాలు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఒక కలల లోకాన్ని మన కళ్ళ ముందుకు తెస్తాయి. సరే... ఈ వర్ణనలాపి, నా ఇష్టాయిష్టాలు కాసేపలా పక్కకుబెట్టి అసలు విషయానికొద్దాం.
ఈ సినిమాపై చాలా మంది ఇప్పటికే చాలా విశ్లేషణ చేసారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పారు. ఎవరికి దొరికింది వాళ్ళు వెతుకున్నారు. నాకు మాత్రం ఈ సినిమా చూస్తున్నంత సేపు గుర్తుకొచ్చింది మన దేశంలో జరుగుతున్న అచ్చు ఇలాంటిదే ఒక సంఘటన. కాకపోతే ఈ సంఘటన అంతటి ప్రాముఖ్యత సంతరించుకోలేక పోవడానికి కారణం ఇది నిజ జీవితంలో జరుగుతున్న ఘటన, ఇందులో మనల్ను అబ్బుర పరిచే విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు. హీరో గారి వీరోచిత విన్యాసాలు ఉండవు. సినిమాలో పవిత్రమైన చెట్టును కాపాడుకోవాలనుకుంటే, ఇక్కడ ట్రైబల్స్ తము ఎంతో పవిత్రంగా పూజించే కొండను కాపాడుకోవాలనుకుంటున్నారు. సినిమాలో Unobtonium ఖనిజం కోసం ప్రకృతిని కొల్లగొట్టాలని చూస్తే, ఇక్కడ బాక్సైట్ కోసం ప్రకృతిని వికృతంగా మారుస్తున్నారు. సినిమాలో లాగే ఇక్కడా గిరిజనులు విల్లంబులు ఎక్కుపెట్టి మర తుపాకులను ఎదుర్కొంటున్నారు. సినిమాలో కంపనీ పేరు Resources Development Administration (RDA), మన నిజజీవితంలో కంపనీ పేరు వేదాంతా రిసోర్సెస్ (Vedanta resources).
బళ్ళారి "గాలి" సోదరులు "భూమి"ని త్రవ్వుకొని, "ఆకాశం"అంత ఎత్తుకెదిగి, కర్ణాటక ప్రభుత్వానికి "నిప్పం"టించి, బీజేపి అగ్రనాయకులకే "నీళ్ళు" త్రాగించారు. ఇప్పుడు అక్కడ నడుస్తున్న ప్రభుత్వ ప్రాణాలు కాపాడుతున్న పంచభుతాలు వీళ్ళే అని అందరికీ తెలుసు. ఈ గాలికుంటు వ్యాది సోకిన కర్ణాటక ప్రభుత్వం అప్పటి నుండి కుంటుకుంటూ నడుస్తుంది. ఈ కర్ణాటక నాటకాన్ని తిలకించిన వాళ్ళందరూ మైనింగ్ మాఫియా కర్ణాటక ప్రభుత్వాన్ని శాషిస్తుందని గగ్గోళు పెట్టారు. గాలి సోదరుల చేతిలో బీజేపి నాయకులు కీలు బొమ్మలయ్యారని అన్నారు. మరి ఇక్కడ లోకల్ గా ఒక 300 ఎకరాల్లో ఖనిజాన్ని త్రవ్వుకొని బ్రతికే వీళ్ళకే ఇంత బలం ఉంటే, మూడు దేశాల్లో మైనింగ్ చేస్తూ, 9 కంపనీల నడిపిస్తూ, 27,264 ఉద్యోగులతో, 37 వేల కోట్ల నికర సంవత్సర లాభంతో నడిచే కంపనీకి ఇంత ఎంత శక్తి ఉండాలి. మన భారత ప్రభుత్వానికి కూడా కొన్ని బడా కంపనీలు దిశా నిర్దేశం చేస్తున్నాయని ఎవరైనా అంటే అది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ అందులో కాస్తయినా నిజం లేక పోలేదు.
వేదాంత రిసోర్సెస్. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ (LSE) లో ట్రేడింగ్ చేసున్న కంపని. FTSE 100 లో ఒకటి. మార్కెట్ కాపిటల్ పరంగా LSE మైనింగ్ సెక్టార్లో ఎనిమిదవ అతిపెద్ద కంపెని. India, Zambia and Tasmania లో మైనింగ్ చేస్తుంది (ఇండియా లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకు వేదాంత పిల్ల కంపనీ Sterlite Industries గురించి తెలిసే ఉంటుంది). వీళ్ళకు ఒరిస్సాలో "నియమ్ గిరి" పర్వతంపై పుష్కలంగా ఉన్న బాక్సైట్ ఖనిజం కావాలి. కానీ అది అక్కడ నివసిస్తున్న డోంగ్రియా కోండ్ గిరిజనులకు పవిత్రమైన పర్వతం. సినిమాలో మాదిరిగానే ఈ కంపనీ వాళ్ళు గిరిజన అభివృద్ధి పేరుతో అక్కడికి రోడ్లు వేసారు. స్కూల్లు కట్టించించారు. వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించారు. ఇప్పుడు మెల్లిగా అక్కడ నుండి వాళ్లను సాగనంపడానికి తయారయ్యారు. దీనికి అక్కడి గిరిజనులు, పర్యవరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. సుప్రీంకోర్ట్ కు వెళ్ళారు. కానీ మన "భారత న్యాయస్థానం" ముందు ఎవరి వాదన పనిచేయలేదు.
వేదాంత ఇప్పుడీ కొండను తవ్వితోడుకోవడానికి సుప్రీంకోర్ట్ నుండి అనుమతి సంపాదించింది. డోంగ్రియా కోండ్ ప్రజలను అక్కడ నుండి తరిమేయడానికి రాజముద్రికతో వస్తుంది. ఇక వాళ్లకు ఆడ్డంగా మిగిలింది అక్కడ ఉంటున్న నక్సలైట్స్. వాళ్ళను ఈ అడవీ ప్రాంతం నుండి సాగనంగే పని మన హోం మంత్రి చిదంబరం చేపట్టాడు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు మీద నక్సలైట్లనీ, నక్సలైట్ల పేరు మీద అక్కడుంటున్న గిరి పుత్రులను తుపాకీ బెదిరింపులతో సాగనంపుతున్నారు. అక్కడ నుండి ఇప్పుడీ గిరిజనులను తరిమి ఆ ప్రాంతాం మొత్తాన్ని మైనింగ్ కంపనీలకు అప్పజెప్పడానికి, గన్ నీడలో గనులు త్రవ్వడానికి ఈ ఆపరెషన్ మొదలు పెట్టారు అన్నది చిదంబర రహస్యం. ఈ పనిపై చిదంబరానికు గల నిబద్ధతకు కారణం.. ఈయన గతంలో ఈ కంపనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక్కడు. 2003 వరకు ముంబై హై కోర్ట్ లో ఈ కంపనీ ప్రతినిధిగా హాజరయ్యాడు (Wikipedia).
అంతర్జాతీయంగా Survival International డోంగ్రియా కోండ్ గిరిజనుల తరుపున పోరాడుతుంది. వివిధ పర్యావరణ సంస్థల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తుంది. పర్యావరణవేత్తలు మన దేశంలో (BBC), లండన్ లో చాలా సార్లు London Stock Exchange ముందు Bank of England ముందు ప్రొటెస్ట్ చేసారు BBC). ఈ కంపనీ ట్రేడింగ్ ఆపేయమని, LSE నుండి డిలిస్ట్ చేయమని విజ్ఞప్తి చేసారు. కానీ ఇంగ్లాండ్ ప్రభుత్వం లెక్కజేయదు ఎందుకంటే...చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు ఈ కంపనీలో 4.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులున్నాయి (BBC. అది అప్పుడు. ప్రస్తుత పెట్టుబడుల విలువ 25 మిలియన్ డాలర్లు). ఒక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కే కాదు, ఇతర హెడ్జ్ ఫండ్ కంపనీలకు ఇందులో చాలా పెట్టుబడులున్నాయి. వాళ్ళకు ఇదో బంగారు గుడ్లు పెట్టే బాతు.
కుక్క కరిచిందని, పంది ప్రదక్షిణలు చేసిందని సంచలమైన వార్తలు ప్రసారం చేసి మెరుగైన సమాజం కోసం 24 గంటలు మొరిగే మన తెలుగు మీడియా ఇలాంటి విశయాల్లో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తాయి. ఈ విశయం పై తెలుగులో ఎక్కడా పెద్దగా వార్తలు వచ్చినట్లు నాకు కనబడలేదు. కేవలం ఆంధ్రజ్యోతిలో అల్లం నారాయణ గారు వ్రాసిన ప్రాణహితలో తప్ప.
వేదాంత గురించి చదివినప్పుడల్లా ఈ కంపనీ చేస్తున్న పని గురించి కొందరికైన చెప్పాలనిపించేది.ఇప్పుడు అవతార్ సినిమా మూలంగా ఈ విషయంపై రాయడానికి సందర్భం వచ్చింది.
- ఏకలింగం

Subscribe to:
Posts (Atom)
మాలిక నియమాల్లో మార్పులు
ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...
-
సుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగ...
-
తెలుగు బ్లాగుల కోసం ఒక వేగవంతమైన సంకలిని, "మాలిక" , మరియూ తెలుగు మైక్రో బ్లాగింగ్ సైట్ "కేక" ఈ రోజు నుండి పూర్తిస్థాయి...
-
భాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల ...