Thursday, 24 February 2011

మాలికలో మార్పులు

మాలికలో సినిమా బ్లాగులు, వార్తల బ్లాగులు ఎక్కువై పోయాయని, ఇవి చేయడం వలన మామూలు బ్లాగులు కనబడకుండా పోతున్నాయని కొంత మంది ఈమేయిల్స్ మరికొంత మంది బ్లాగు టపాలు, కామెంట్స్ ద్వారా తెలిపారు. అందరికి కృతజ్ఞతలు.

ఇప్పుడున్న బ్లాగులను స్థూలంగా మూడు గ్రూపులుగా విభజించవచ్చు.

(1) సాదారణ బ్లాగులు
(2) సినిమా బ్లాగులు
(3) వార్తా బ్లాగులు

మాలిక ప్రోత్సహించాలకునేది సాదారణ బ్లాగులనే. అలాగని సినిమా కబుర్లు, వార్తల కోసమే ఉన్న బ్లాగులకు పూర్తి వ్యతిరేకం అని కాదు.

ఇక ముందు జనరల్ బ్లాగులకు ప్రాముఖ్యం కలిపిస్తూ, వాటిని వేరుచేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఇది ముందుపేజిలో రాబోయే చిన్న మార్పు. అంతేకాక, సాదారణ బ్లాగుల్లో జరిగే చర్చ మాత్రమే మాలిక కామెంట్స్ పేజీలో వస్తుంది.

కొన్ని బ్లాగులు మాడరేషన్ లేకుండా గాలికి వదిలేయడంతో ఎంత నియంత్రించిన అప్పుడప్పుడు అందులోంచి వచ్చే అసభ్య కామెంట్స్‌తో మాలిక నుండి పోతుంది. ఇలా ఎప్పుడూ జరిగితే ఆ బ్లాగు నుండి కామెంట్స్ శాశ్వతంగా మాలికలో కనబడకుండా చేయబడతాయి.


ఇంగ్గ్లీష్ తెలుగు నిఘంటువు
--------------------------

సమయం అనుకూలించక పోవడంతో నిఘంటువు పనులు నిలిచిపోయాయి. చాలా మంది ఎన్నో సూచనలు చేసారు. కొత్తపదాలు జతచేయమని పంపారు. తొందర్లోనే అందరి సూచనలను పరిగణలోకి తీసుకొని నిఘంటువు పనులు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము.


Please send your comments, views and concerns to admin@maalika.org.

- On behalf of మాలిక టీం

మాలిక నియమాల్లో మార్పులు

ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే  ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది  నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...