Monday, 13 June 2011

తెలుగు భాషాపరిరక్షణకి సరికొత్త ఉద్యమం: నల్లమోతు శ్రీధర్ కు నా మద్దతు

చదువుకోక ముందు కాకరకాయ అంటే చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడట వెనకటికెవడో... ఇప్పుడు బ్లాగుల్లో కొంతమంది పదవిన్యాసపు పైత్యప్రేలాపనలు చూస్తే అలాంటి వాళ్ళు ఇప్పుడు మన మధ్య కూడా ఉన్నారనిపిస్తుంది. చిత్తభ్రాంతిలో చెత్తవాదనతో కొత్త పదాలను కనిపెట్టి, వాటినే అచ్చతెలుగు పదాలుగా బుకాయించి అందరినెత్తిన రుద్దాలనే ఈ జాఢ్యాన్ని ఇకనైనా అంతాకలిసి ఆపడానికి ప్రయత్నిద్దాం. ఇంటర్నెట్‌లో, బ్లాగుల్లో తెలుగు భాష పేరుతో పదాలను ఖూనీ చేసింది చాలు. ఇప్పటికే ఉపేక్షించి చాలా పొరపాటు చేసారు.

శ్రీధర్ గారు మీ ప్రారంభం అభినందనీయం. మీకు నా సంపూర్ణ మద్దతు.

తెలుగు భాషాపరిరక్షణ

తెలుగు భాషాపరిరక్షణకి సరికొత్త ఉద్యమం – మీరూ భాగస్వాములవుతారా?

బ్లాగుల్లో భాషా బానిసత్వము-1

బ్లాగుల్లో భాషా బానిసత్వము-2

0 comments: