Monday, 29 November 2010

మాలిక: English-Telugu Dictionary

ఎప్పటి నుండో పూర్తి చేద్దాం అనుకున్న ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు ఇన్ని రోజులకు ఓ కొళిక్కి వచ్చింది. ఒక వారం రోజుల్లో పూర్తి అవుతుందనుకున్న పని వివిధ కారణాల వల్ల ఇంకా అవుతూనే ఉంది. ఇంకా ఎక్కువ రోజులు ఆపకుండా ఇంతవరకు చేసిన దానిని మొదట విడుదల చేసి, అవసరానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాము.

నిఘంటువు సైటు అడ్రస్: http://dictionary.maalika.net

పబ్లిక్ డొమైన్లో అందుబాట్లో ఉన్న Charles Philip Brown's English to Telugu నిఘంటువులోని ఆంగ్ల పదాలని, వాటి తెలుగు అర్థాలను ఇక్కడ నుండి తీసుకున్నాము. ఇందులో చాలా మర్పులు చేర్పులు అవసరం అయ్యాయి, ఇంకా అవుతూ ఉన్నాయి. బ్రౌణ్ నిఘంటువులోని పదాలతో పాటు, అందులో లేనటువంటి కొన్ని పదాలను చేర్చాము.

ఈ సైట్ విషయానికి వస్తే, Simple design, Easy navigation, User interactivity and Powerful search queries, వీటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతం మాలిక మేయిన్ సర్వర్ http://maalika.org పై కాకుండా http://maalika.net పై నుండి నడుస్తుంది.

ప్రస్థుతం ఈ నిఘంటువు అభివృద్ధి దశలో ఉంది. ఎంత జాగ్రత్తగా క్యూరేట్ చేసినా కొన్ని పదాలు ఇంకా తప్పుగా, అర్థాలు అసంబద్దంగా ఉన్నాయి. అవి అన్నీ వెతకడం మా కొందరితో అయ్యే పని కాదు. అందుకని వాడుకదారులకే తప్పులు ఎత్తిచూపే సౌలభ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైనా పదానికి, లేదా అర్థానికి మార్పును సూచించాలనుకుంటే, మీరు ఆ పదం వెతికినప్పుడు కుడివైపున కనబడే "మార్చండి" అన్నదానిపై నొక్కి మీ సూచనలు పంపండి. అలాగే ఏదైనా ఆంగ్ల పదానికి తెలుగు అర్థం ప్రస్తుతం ఉన్న నిఘంటువులో లేకపోతే, ఆ పదాన్ని కలపమని కూడా మీరు సూచించవచ్చు.

ఈ నిఘంటువు ఇంకా అభివృద్ధి చేయడం అన్నది నిరంతరం సాగే ప్రక్రియ. వీలైనన్ని కొత్త పదాలు చేర్చడంతో పాటు, వ్యతిరేక పదాలు, పర్యాయ పదాల మరియు పదాల వాడుక లాంటివి ముందుముందు ఈ నిఘంటువు నుండి రాబోతున్నాయి.

ఆంగ్ల పదాలను, వాటి తెలుగు అర్థాలను సరి చూడడంతో పాటు, కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు అర్థాలు వెతకడం, తిరిగి రాయడం చేసింది, చేస్తున్నది... మృదుల, రంజీత్, భరధ్వాజ్, శ్రీను.


Maalika updates
---------------
కొన్ని పానరోమిక్ ఫోటోలు మాలికలో వచ్చినఫ్ఫుడు వాటి వెడల్పుకు తగ్గట్టు మాలిక పేజిసైజు కూడ మారుతుండేది. ఇక ముందు అలా జరగదు (Thanks to Badri for notifying this issue)

ఒక బ్లాగు నుండి ఎన్ని కామెంట్స్ తీసుకోవాలి అన్నదానిపై ఎటువంటి లిమిట్ ఇంతకు ముందు లేదు. అయితే అప్పుడప్పుడు కొన్ని బ్లాగుల్లో కామెంట్స్ స్పామింగ్ పుణ్యాన మాలిక కామెంట్స్ పేజీ మొత్తం ఒకటీ/రెండు బ్లాగుల కామెంట్స్ తోనే నిండుగా కళకళలాడుతుండేది. దానిని అరికట్టడానికి గత నెలరోజులుగా ప్రతి బ్లాగు నుండి కేవలం ఐదు కొత్త కామెంట్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఏ బ్లాగులో కామెంట్స్ పోటీ పెట్టుకున్న వాటితో మాలిక నిండిపోవడం అన్నది ఉండదు.

14 comments:

Anonymous said...

good work..keep going...all the best...

విజయ్ said...

ఈ టపాకి సంబంధం లేని ప్రశ్న - మాలికలో పాత టపాలు చూసే అవకాశం లేదా?

-విజయ్

ఆ.సౌమ్య said...

very nice...good work.

i like the point about comments....this change is needed i guess.

Sury Vulimiri said...

రచయితకు సరైన పదం దొరకకపోతే ఒక్కొక్కొసారి కలం నిలిచిపోతుంది. మీ ప్రయత్నం మంచి చేయూతనిస్తుంది.

కొత్త పాళీ said...

good effort.

వేణూ శ్రీకాంత్ said...

Great going...Looks simple and cool..

Thx for the Much needed upgrade for Maalika comments section.

Apparao Sastri said...

మరి మా కామెంట్స్ ఆట ఎలా ?

lakshmi.p said...

good work...

ఏక లింగం said...

Thanks Anon
@విజయ్,
ప్రస్తుతానికి లేదు.
ఇంతకు ముందు కొన్ని మంచి బ్లాగులను ఆర్కైవ్ చేయాలి అనుకున్నాము. దాని కోసం సైట్ కూడా తయారుచేసి కొన్ని బ్లాగులు కలిపి చూడడం జరిగింది. (http://maalika.in). కొన్ని ఇతర కారణాల వలన ఆ పని తాత్కాలికంగా ఆపడం జరిగింది. తొందర్లోనే మాలిక నుండి మీరు పాత టపాలు కూడా చూడవచ్చు.
థాంక్స్ సౌమ్య.
Thank you Sury Vulimiri. మీరు నిఘంటువు సైటు నుండి పంపిన పదాలకు, చేసిన సూచనలకు కృతజ్ఞతలు. వాటిని తొందర్లోనే జతచేస్తాము.
కొత్తపాళీ, వేణు, లక్ష్మి... కృతజ్ఞతలు.
@ అప్పారావు,
ఎవరొద్దన్నారు. మీ ఆట మీరు ఆడండి. అలాగే ఎవరి ఆట వాళ్ళు ఆడతారు.

సుజాత said...

వాడుక దారులకే ఎత్తి చూపే సౌలభ్యాన్ని ఇవ్వడం జరిగింది......

ఆంగ్ల పదాలకు సమానార్థాల విషయంలో చాలా మంది ఒకరితో ఒకరు ఏకీభవించరు. బ్లాగుల్లో మరీ! ఇలాంటపుడు ఒక పదానికి ఖచ్చితమైన తెలుగు అర్థం నిర్థారించడం ఎలా? ఎక్కువమంది ఆమోదించిన అర్ధాన్ని ఆ పదానికి అర్థంగా నిఘంటువులో చేర్చడం జరుగుతుందా?

Anonymous said...

kudos to you maalika team...., for the dictionary and changing comments display section :)

ఏక లింగం said...

సుజాత గారు, అలాంటి అప్పుడు అన్ని పదాలు ఇద్దాం. ఎవరికి ఆమోదమున్నది వాళ్ళు వాడుకుంటారు. ఏ గొడవ ఉండదు.

Thanks Anon.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

ఈ నిఘంటువులో బహువచన పదాల్ని వెతకచ్చా?
ఉదాహరణకు నేను Surprise అని వెతికితే అర్థం కనపడింది. Surprises అనే పదం వెతికితే కనబడలేదు.
దీని గురించి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అంటే అలా ఏకవచన పదాలకు మాత్రమే అర్థం ఇచ్చేలా వాడుకరుల విజ్ఞతకే వదిలేయడమా? లేక బహువచన పదాల కోసం వెతికినపుడు సంబంధిత ఏకవచన పదాల అర్థాలకు దారి మళ్ళించడమా అనేది నిర్ణయించుకోండి.

ఏక లింగం said...

@ రవిచంద్ర
ఇప్పుడున్నదాంట్లో వీలుకాదు.

ఇలాంటివే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి...అవన్నీ వచ్చేనెలలో విడుదల చేసే వెర్షన్ లో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము.

Post a Comment