Friday, 30 July 2010

మాలిక టీమ్...

మాలికతో పాటు డెవలప్ చేసిన మరొక సైట్ "కేక". దీనిని మైక్రోబ్లాగింగ్ కోసం అభివృద్ది పరచడమైనది. పేజీల కొద్ది వ్రాసే ఓపిక లేనప్పుడు, చెప్పాలనుకున్నది సింపుల్‌గా చెప్పాలనుకున్నడు ఒక్క కేక వేయండి.

కేకను డెవలప్ చేసి, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నది విమల్... మరో పేరు "డ్రుపాల్ విమల్". వెబ్‌కు సంబంధించి ఎటువంటి పనినైనా "డ్రుపాల్" CMS ఉపయోగించి చేసేయడం విమల్ గొప్పతనం. "కేక" నిర్వహననే కాకుండా మరింత వేగవంతమైన అగ్రిగేటర్ కోసం తను పని చేస్తున్నాడు.

ప్రస్తుతం భరద్వాజ్, పద్మ ఇద్దరూ కలిసి "రియల్ టైమ్" అగ్రిగేటర్ తయారు చేసే ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీలైతే భవిష్యత్తులో మాలిక కంటే వేగవంతమైన సంకలిని తయారు కావచ్చు.

తొందర్లో ఆర్కే (the Yogi), మాలిక నిర్వహన బాద్యతలు చెపట్టబోతున్నాడు.

ఇవి ప్రస్తుత టీం పనులు. మాలిక డెవలప్ చేయడానికి టీమ్ సభ్యులే కాకుండా శరత్, వికటకవి శ్రీనివాస్, జీవని ప్రసాద్, ఇంకా కొందరు వాళ్ళకు తోచిన సహాయం సలహాల ద్వారా, సూచనల ద్వారా, ప్రచారం ద్వారా చేసారు. మరి కొంతమంది మాలిక టీం తో కలిసి మరింత అభివృద్ది చేయడానికి వాళ్ళ ఉత్సుకత చూపించారు. వాళ్లందరికీ ధన్యవాదాలు.

అడిగిన వెంటనే మాలిక కోసం శ్రమ అనుకోకుండా వాళ్ళ సమయాన్ని కేటాయించి బటన్ డిజైన్ చేసి పంపిన శివ బండారు, జగదీశ్ రెడ్డి, ధరణీరాయ్ చౌదరి లకు మాలిక టీం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు పంపిన మాలిక బటన్స్ ఇక్కడ చూడొచ్చు.


ఇదీ క్లుప్తంగా మాలిక గురించిన సమాచారం. మాలిక గురించి మరింత సమాచారం ఏమైనా కావాలనుకుంటే ఆడగండి.

10 comments:

Anonymous said...

కొన్ని తప్ప చాల బటన్స్ " మాలిక " లా కనిపించటం లేదు. అన్ని
" మావిక " లాగా కనిపిస్తున్నాయి. గ్రాపిక్స్ ఎక్కువయ్యామే ఒక్కసారి చూడండి. కొత్త వాళ్ళు చూస్తే "మావిక" అని అనుకుంటారేమో

శివ బండారువి కొన్ని "మాలిక" లా కనిపించినా; ధరణి గారివి, జగదీశ్ గారివైతె "మావిక" లానె వున్నాయి

ఏకలింగం అభిమాని

పానీపూరి123 said...

> మాలిక డెవలప్ చేయడానికి టీమ్ సభ్యులే కాకుండా శరత్, వికటకవి శ్రీనివాస్, జీవని ప్రసాద్
ఇప్పటివరకు మలక్‌జి = ఏకలింగం, ఏకలింగం = వికటకవి అనుకుంటున్నాను.
అందరూ వేరు వేరా? :-)

ranjani said...

ఇంతకీ ఏకలింగం ఎవరు? నిజంగా కల్నలేనా?
కొందరనుకున్నట్లు ఇది ఉత్తుత్తి పేరేనా..

Anonymous said...

maalika google reader lo enduku pani cheyatledu....ee maarpu cheste baaguntundi

ఏక లింగం said...

@ anonymous,
అందులో వాళ్ల పొరపాటు ఏమీ లేదండి. వాళ్ళు లోగోలు చాలా పెద్దగా చేసి పంపారు. వాటిని చూస్తే అవి మాలిక లాగే కనబడతాయి. కానీ సైజ్ చిన్నగా చేయడం వలన మాలిక కాస్త మావిక లా కనబడుతున్నట్లుంది. సరిదిద్దడానికి ప్రయత్నిస్తాము.

@ పానీపూరి
అందరూ వేరు వేరే!!!

@రంజని,
అవును ఉత్తుత్తి పేరే :)

ఏక లింగం said...

@ అజ్ఞాత,
గూగుల్ రీడర్‌లో వచ్చేట్లు చేయవచ్చు. కానీ అలా చేస్తే మాలిక సైట్‌కు రాకుండా అక్కడే చదువుకుంటారు. అందుకే ఇప్పుట్లో ఆ మార్పు చేయక పోవచ్చు.

శ్రీనివాస్ said...

నా పేరు పలకరించినందుకు ధన్యవాదాలు :) మాలిక ముందు ముందు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను :)

jeevani said...

మరీ మొహమాట పెట్టేశారండీ! ఎవరైనా చూస్తే నాకు టెక్నికల్ గా ఏదేదో తెలుసు అనుకుంటారు. నేను చెప్పిన రెండు పాయింట్లకు అంత సీను ఇవ్వడం బాలేదేమో. మరోసారి మాలిక అభివృద్ధిని సేవల విస్తృతిని మనసారా కాంక్షిస్తూ ....

Anonymous said...

అజ్ఞాతల హక్కులను కాలరాచే ప్రయత్నాలను ఏమిచేస్తున్నారు?

కొంతమంది వుడుకుమోత బ్లాగర్లు తమ పిడి వాదమే వినిపించాలని, అసబ్య రాతలు లేకున్నా అజ్ఞాతల పీక నొక్కి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీన్ని కల్నల్ ఏకలింగం గారు ఖండిస్తూ ఓ ప్రకటన చేయాలి.

Vimal said...

Along with Vikatakavi Sreenu, I also thank Ravi Chandra Enaganti (http://ravichandrae.wordpress.com) who helped me in building keka.

Post a Comment