Thursday, 29 July 2010

గత, ప్రస్తుత మరియు భవిష్య మాలిక

ప్రతి బ్లాగర్ తను వ్రాసింది పోస్ట్ చేయాగానే కోరుకునేది తొందరగా తన టపా అగ్రిగేటర్లో రావాలని, ఇతరులు చదవాలని. అంతేగాక, బ్లాగులు చదివే అందరికీ ఉండే ఆసక్తి ఏంటంటే ఏ బ్లాగులో ఎవరేమనుకుంటున్నారు అని. మాలిక మొదలు పెట్టినప్పుడు ఈ రెండు విశయాలపైన శ్రద్ద పెట్టి, టపాలు వీలైనంత తొందరగా మాలికలో వచ్చేట్లు, కామెంట్లను స్నిప్పెట్స్ లా కాకుండా పూర్తిగా చూపించేట్లు డెవలప్ చేయడం జరిగింది. మొదట్లో మాలికలో కొత్త టపాలు/వ్యాఖ్యలు అన్నీ ఒకే వరుసలో వచ్చేవి. ఇలా ఒకే వరుసలో చూపించడం వలన బ్లాగర్లు వ్రాసింది తొందరగా మాలిక నుండి వెళ్ళిపోయేవి. దీనికి పరిష్కారంగా టపాలు/వ్యాఖ్యలు రెండు వరుసల్లో వచ్చేట్లు మార్చడం జరిగింది.

తరువాత కాలంలో మాలికలో ఫోటోబ్లాగులు, వార్తలు, వెబ్ పత్రికలు చేర్చడంతో పాటు టపాలు, వ్యాఖ్యలు వాటంతటవే రీలోడ్ అయ్యేలా చేయడం జరిగింది. కానీ గత కొద్ది రోజులుగా, సర్వర్లలో మార్పుల కారణంగా కొన్ని ఫీచర్స్ తొలగించాము. అవి ఏమిటంటే...

1) No auto-reload
2) No news
3) No new webzine posts
4) No Limit on number of posts

ఆటో రీలోడ్ వలన కొంత బ్యాండ్‌విడ్త్ వేస్ట్ అవడం తప్ప పెద్దగా ఫలితం లేదు. భవిష్యత్తులో కూడ ఆటో రీలోడ్ అవసరం రాకపోవచ్చు. మాలిక లో వార్తలు ఇవ్వడం కూడా ఇక ముందు ఉండక పోవచ్చు. ఎందుకంటే తాజా వార్తలనందించే ఎన్నో వెబ్‌సైట్‌లు అందులోబాట్లో ఉన్నప్పుడు ఇక్కడ వార్తలు ఇవ్వడం అనవసరం అనుకుంటాము. ఇక వెబ్ పత్రిల కోసం ఒక ప్రత్యేకమైన పేజీ తయారుచేసి వాటిని రియల్‌టైమ్ డిస్ప్లే‌లా ఇవ్వాలని అనుకుంటున్నాము. దానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇంతకు ముందు మాలిక ప్రతి బ్లాగు నుండి కేవలం రెండు టపాలు మాత్రమే చూపించేది.ఇప్పుడు ఆ లిమిట్ లేదు. ఇక ముందు లిమిట్ ఉంచాలా లేదా అన్నది బ్లాగర్లు రోజుకు ఎన్ని టపాలు వ్రాస్తున్నారు, వాటి వలన మిగతా టపాలు కొట్టుకు పోతున్నాయా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.


ప్రస్తుతం మాలికలో వీలుకానివి:
1) సెర్చ్
మాలికలోని పేజీలన్నీ (ఒకటీ, రెండు తప్ప) డైనమిక్ పేజీలే అవడంతో, మాలిక సర్వర్లో ఏమీ స్టోర్ చేయకపోవడంతో సెర్చ్ చేయడానికి ఏమీ లేదు.
2) కొన్ని బ్లాగుల నుండి కామెంట్స్
ప్రస్తూతం మాలికలో కామెంట్స్ అన్ని బ్లాగుల నుండి రావడం లేదు. కొన్ని బ్లాగులకు మాడరేషన్ లేక పోవడంతో స్పామ్ కామెంట్స్ ను అరికట్టడానికి అలాంటి బ్లాగుల్లో నుండి కామెంట్స్ తోసుకోవడం లేదు. మీ బ్లాగులో స్పామ్ కామెంట్స్ లేకున్నా కూడా మాలికలో మీ బ్లాగు నుండి కామెంట్స్ కనబడకపోతే, admin@maalika.org కు ఈమేయిల్ ఇవ్వండి.

మాలిక మొదలు పెట్టిన కొత్తలో వచ్చిన సూచనల, సలహాల ప్రకారం ఇక్కడ ఆడ బ్లాగర్లు, మగ బ్లాగర్లు, జూనియర్ బ్లాగర్లు, సీనియర్ బ్లాగర్లు, ఎక్కువ వ్రాసిన బ్లాగర్లు, తక్కువ వ్రాసిన బ్లాగర్లు అన్న భేదాలు చూపదల్చుకోలేదు. మాలికలో అందరూ సమానమే.

కొన్ని బ్లాగులు మాలికలో కనబడడం లేదు ఏమైనా కారణమా అని కొందరి సందేహం. మొదట మాలికను పరిక్షించడానికి రెగ్యులర్‌గా కనబడే కొన్ని బ్లాగులు తీసుకొని చూడడం, వాటితోనే విడుదల చేయడం అయింది. ఆ తర్వాత బ్లాగర్ల రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళవాళ్ళ బ్లాగులు మాలికలో కలపడం జరిగింది. అంతేకాని ఎటువంటి కారణం లేదు. ఎవరి బ్లాగునైనా మాలికలో కలపడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

ముందుముందు...
తెరచాటు పనులన్నీ చక్కబెట్టి, మాలిక కుదురుగా నడుస్తుందనుకున్న తరువాత ఫ్రంట్‌ఎండ్ డిజైన్‌లో మార్పులు చేర్పులు జరుగొచ్చు. రియల్‌టైమ్ అగ్రిగేషన్ కోసం ప్రయాత్నాలు చేస్తున్నము. ఫోటో బ్లాగులు, వెబ్ పత్రికలు మొదటి పేజిలోకి వచ్చేట్లు డిజైన్ మార్పులు చేయాలనుకుంటున్నాము. ఇవే కాకుండా మాలిక అనుబంధ వెబ్‌సైట్లు కొన్ని రావచ్చు. అవి ఏమిటన్నది తొందర్లోనే చెప్తాము.

మాలికను ఎవరిపైనా పోటీకి పెట్టలేదు. మాకు ఎవరితోనూ పోటీలేదు, మాకెవరూ పోటీకాదు. మాలిక ఒక తటస్థ వేదిక మాత్రమే. ఇది అనతికాలంలోనే ఇంతలా ఆదరణకు నోచుకోవడం సంతోషం కలిగించే విశయం. అయితే, అప్పుడే సంవత్సరాల నుండి రంగంలో ఉన్న అగ్రిగేటర్లతో ఇంకా దినాలు లెక్కబెట్టుకుంటున్న మాలిక ను పోల్చి మా స్థానం ఇది అని తేల్చేస్తున్నారు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లలో మాలిక స్థానం ఏదైనా ప్రస్థానం మాత్రం ఆగదు. హిట్లెన్ని వచ్చినా, పేజ్ ర్యాంక్ ఎంతైనా, అలెక్సా ర్యాంకింగ్ ఎటుపోయినా, ప్రత్యేక ప్రచారం ఉన్నా/లేకపోయిన మాలిక మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అవసరానికి తగ్గట్లు, వీలైనంతలో కొత్త ఫీచర్స్ అందిస్తూనే ఉంటుంది.


(రేపు మాలిక అల్లికలో సహాయపడ్డవాళ్ళ గురించి...)

16 comments:

3g said...

"తెలుగు బ్లాగు అగ్రిగేటర్లలో మాలిక స్థానం ఏదైనా ప్రస్థానం మాత్రం ఆగదు"

జయహో మాలిక........

డుబుగు said...

Carry on the GOOD work brother. If possible, (first let me recover well) and if u allow, I too will join hands.

Gani said...

Good work, keep it up. Could you consider re-enabling auto-refresh feature please?

ఏక లింగం said...

Thanks 3G.

Dubugu.... where were you all these days?

@ Gani,
Sure. give us some time.

సావిరహే said...

yeah! its realy a tough job but you can do it ekalingam garu ,even we are all with u sir !
its not only ur baby but also ours.

రవిగారు said...

ఏకలింగం గారు నాకు తెలిసి చాల మంది బ్లాగ్ బందువులు
మాలిక తప్ప వేరే అగ్రిగటార్ చూడటం లేదంటే అతిశయోక్తి కాదు .
రాసిన వెంటనే మాలిక లో వచ్చిందా లేదా ?అని చెక్ చేసుకుని
మరి నిద్రకి వుపక్రమిస్తున్నారని వేగుల సమాచారం
.ఆనతి కాలం లోనే అందనంత ఎత్తుకు ఎదిగినందుకు
అభి నందనలు అందుకోండి ,విజయ పంధాలో సాగి పోండి

బద్రి said...

"Never compete/compare yourself with others, just try to be UNIQUE" - Maalika,

Good going maalika.

గీతాచార్య said...

Why compare? Everything is Unique, and itz a great work by u all. Wish you all the best... no, better than the Best :-)

ఏక లింగం said...

Thank you Savirahe, Ravigaru, Badri and Geeta

Krishnapriya said...

Hmm..
మాలిక ఇంత కొత్తదని నాకు తెలియదు. నేను కూడా మాలిక మొదలైనరోజే బ్లాగు తెరిచాను. (ఏప్రిల్ 19, 2010). అయితే నేనూ బ్లాగ్ తెరిచి 100 రోజులయిందన్నమాట :-)
తర్వాత తెలుగు బ్లాగ్స్ మీద గూగుల్ చేసినప్పుడు కనపడి మాలిక/కూడలి/జల్లెడ/హారం లో రెజిస్టర్ చేశాను.
ఇప్పుడు మాలిక కి ప్రతిరోజూ వెళ్తున్నాను.

హార్టీ కంగ్రాచ్యులేషన్స్!
కృష్ణప్రియ/

Wit Real said...

ఇంతకు మునుపు, బెత్తముచ్చుకొని, బ్లాగులెంట తిరిగెవాన్ని... ఈ మధ్య రోజూ మాలికకోపదిసార్లొచ్చెల్తున్నాను ;)

Appreciate all your good work!

Anonymous said...

మాలిక వెనుక జరుగుతున్న కృషి అభినందనీయం. మాలిక స్థాపకులలో ఒకరైన పద్మ గారిని పరిచయం చేయగలరు. వీరు ఈమాట ఒకప్పటి సంపాదకవర్గ సభ్యులా?

ఏక లింగం said...

Thanks Krishnapriya and Wit Real.

@ paradarsi,
తప్పకుండా అందరిని పరిచయం చేస్తాము. ఈ పద్మ మీరంటున్న పద్మ కాదు.

Anonymous said...

పారదర్శి గారి కన్ను పద్మ గారిమీద పడిందేంటో

Anonymous said...

@Anonymous:మాలిక స్థాపకులను పరిచయం చేసిన 
Blog Aggregators’ T.R.P.
అనే వ్యాసంలో, సరైన సమాచారం అందక, పద్మ గారికి ఎలాంటి credits ఇవ్వలేదు. మాలిక వెనుక ఇంత కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలా, వద్దా? 

ranjani said...

భాస్కరరావుగారూ
ఈ పద్మగారెవరో మీకు, మాలిక టీమ్ వారికి తప్ప
ఇతరులకి తెలిసినట్లు లేదు. అందరినీ పరిచయం
చేస్తానని చెప్పిన ఏకలింగంగారు - ఏదో కారణం
వల్ల కేవలం పేర్లని ప్రస్తావించి తాంబూలం ఇచ్చేసానని
అంటున్నట్లుంది..

Post a Comment