Monday, 7 September 2009

జగన్నాటకం...

పసందైన రాజకీయ నాటకానికి రంగస్థల వేదికగా రాష్ట్రం మారింది. తెరచాటు వేషగాల్లు ఇప్పుడిప్పుడే పాత్రలతో సిద్ధమవుతున్నారు. తెరముందు వేషగాల్లు అప్పుడే వాళ్ల నటనా కౌషలం ప్రదిర్శించడం మొదలు పెట్టారు. కల్తీ లేని నటన, విమర్శకు వీలులేని అభినయం, యాచకులు నేర్చుకోదగ్గ వాచకం, స్వచ్చమయిన స్వార్దం, వెరసి మన ముందుకొచ్చిన జగన్నాటకం. ఒక ఉగ్రనరసింహ్ముని వేషం రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిగా చేస్తానంటే, ఒక అమ్మవారి ఆకారం రక్తం ఏరులై పారిస్తానంటుంది. అన్ని వేషాలు కలిసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాయట.

ఈ నటచక్రవర్తులకు తోడు భజన బృందాలు. ఒకడు కీర్తనలు పాడుతడు, ఒకడు ప్రార్థనలు చేస్తాడు, మద్దెల వాయించేవాడు ఒకడయితే, తాళాలు కొట్టేవాడు మరొకడు, ఉడతలు పట్టేవాడు కూడా వీలుచూసుకొని చిడతలు కొడుతున్నాడు. ఈ విద్యలెందులో ప్రవేశం లేని వాళ్లు దరువుకు అనుగుణంగా, శృతి తప్పకుండా ఆరున్నొక్కరాగం ఆలాపిస్తున్నరు.

వేషమేదయినా, భజన ఎవరు చేసినా, ఏడుపు ఎవరేడ్చినా... ఈ నాటకంలో చివరగా అందరికీ కావలసింది ఒక్కటే, అదే యువరాజు గారి పట్టాభిషేకం. తండ్రి "ఆశయాలు" పూర్తిచేయడం ఆయన కుమారుడికి ఒక్కడికే సాధ్యమవుతుందట. తండ్రిగారి నాయకత్వ పఠిమా పాటవాన్ని జన్మతా అందిపుచ్చుకున్నాడట. ఇదంతా చూసి ఇదేమయినా మూర్చ రోగమా తల్లిదండ్రులకు ఉంటే వంశపారంపర్యంగా పిల్లలకు రావడానికి అని అనుకోకండి, కాదు..కుర్చీ రోగం. దానికీ దీనికీ తేడా ఒక్కటే, మూర్చతో కొట్టుకోవడం పుట్టుకతో వస్తే, కుర్చీని పట్టుకోవడం తల్లి లేదా తండ్రి మరణం నుండి సంక్రమిస్తుంది.

ఈ జరిగే తతంగం తోటి రాష్ట్రంలోని టీవీ చానెల్స్ కు కావలసినంత సరకు దొరికింది. కెమరా కన్నులకు ఇదో కలర్ ఫుల్ కార్నివాల్. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న చందంగా SMS polls పేరుతో సందెట్లో సడేమియాలా శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు. చచ్చినవాడి ఆత్మశాంతి దేవుడెరుగు, బ్రతికిన వాల్లకి మనశ్శాంతిని లేకుండా చేస్తున్నారు.

రాజకీయ నాయకునికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం, అందితే జుట్టు పట్టుకోవాడం, అందకపోతే కాళ్లు పట్టుకోవడం. ఇవి రెండూ దొరకక పోతే....నడుము పట్టుకోవడం. అక్కడనుండి మన వీలూ వివరం చూసుకొని అవసరానికి అనుగుణంగా వీలయితే పైకి, కాకపోతే క్రిందికి ప్రయాణం చేయొచ్చు. ఈ నడుమునే పండితులు "జఘనం" అంటే, నోరు తిరగని రాజకీయ నాయకులు "జగను" అంటారు.

-ఏకలింగం

-----------
(గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను, రాజకీయ నాయకుల ఓవర్ యాక్షను చూసి, థూ.. అనిపించి...)

20 comments:

చిలమకూరు విజయమోహన్ said...

అప్పుడే ఏమయింది బాసూ! ముందు ముందు చూడండి ఇలాంటివెన్నో... ఇప్పుడే అందిన వార్త వైయస్సార్ పై వ్యాసరచన పోటీలు,చిత్రలేఖన పోటీలు తర్వాత ఆయన జీవితం పాఠ్యాంశంగా చేర్చడం.

Anonymous said...

నేను కూడా మీతోపాటే, థూ, థూ, థూ

Anonymous said...

Well said..

Bhardwaj Velamakanni said...

ఈ నడుమునే పండితులు "జఘనం" అంటే, నోరు తిరగని రాజకీయ నాయకులు "జగను" అంటారు.
_______________________________________________

WOW!!!!!!!!!! LOLLLLLL

సుభద్ర said...

ఇక్కడ ను౦చి అ౦తా మన నసీబ్ మీద ఆధారపడి ఉ౦టు౦ది...

Sujata said...

రాజశేఖర రెడ్ది చనిపోయారని తెలియగానే ఈ గొడవలు, హై డ్రామా మొదలయిపోయి, ఎవరి కి వారు దీని ద్వారా లాభపడిపోదామని చూడడం - బాధ కలిగించింది. ఇలాంటపుడు ఎవరు లీడర్ అయినా అది వారికి టైట్ రోప్ వాక్ మాత్రమే !

నాగప్రసాద్ said...
This comment has been removed by the author.
కొండముది సాయికిరణ్ కుమార్ said...

:))Super

నాగప్రసాద్ said...

>>"ఈ నడుమునే పండితులు "జఘనం" అంటే, నోరు తిరగని రాజకీయ నాయకులు "జగను" అంటారు."

కేకో కేక. :) :)

Madhu A303 said...

ఈ నడుమునే పండితులు "జఘనం" అంటే, నోరు తిరగని రాజకీయ నాయకులు "జగను" అంటారు."

Keka andee badu Kekoi Keka...Keka...Keka...Ammo navalla ika kaaaadu

aravind said...

Mastu cheppinav brother

Anonymous said...

ఇదంతా చూసి ఇదేమయినా మూర్చ రోగమా తల్లిదండ్రులకు ఉంటే వంశపారంపర్యంగా పిల్లలకు రావడానికి అని అనుకోకండి, కాదు..కుర్చీ రోగం. దానికీ దీనికీ తేడా ఒక్కటే, మూర్చతో కొట్టుకోవడం పుట్టుకతో వస్తే, కుర్చీని పట్టుకోవడం తల్లి లేదా తండ్రి మరణం నుండి సంక్రమిస్తుంది. :)

Anonymous said...

సూపర్ గ రాసారు.
మొగుడిని కొట్టి మొగసాల కెక్కడ వీళ్ళకు బాగా అలవాటు. దారుణమేమంటే ఇంతకాలం చేసిన చెడంతా మంచిగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకాలం జనాలు ప్రతిపక్షాలు, పత్రికలు దుమ్మెత్తిపోసిన పధకాలు అవినీతీ అవన్నీ ఏవో గొప్ప పనులుగా వర్ణిస్తూ తిరిగి ఎవరూ నోరెత్తకుండా చేస్తున్నారు. అతడు చేసింది ప్రాణ త్యాగమట ఇంతకన్నా విడ్డూరం మరొకటి ఎక్కడన్నా వుందా! దానికై భారత రత్న ఇవ్వాల్ట! మహాతుడు, అపర గాంధీ, దైవాంశ సంూతుడు, మహోన్నత నాయకుడు, విసిష్ట వ్యక్తిత్వం గలవాడు ఇంకా ఎన్నో ఎన్నో ఐపోయాడు ఒక్క రోజులోనే!

ఏక లింగం said...

@ చిలమకూరు విజయమోహన్,
అవును.. వ్యవహారం ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతుంది. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కదా...

@ అజ్ఞాతలు, భరద్వాజ్, సుభద్ర,
థాంక్స్.

@ Sujata,
మీరు చెప్పింది నిజమే, ఎవరు ముఖ్యమంత్రి అయినాకాని వాళ్లకా పదవి ముళ్ల కిరీటం గానే ఉండొచ్చు, మూన్నాళ్ల ముచ్చటగనే మిగిలి పోవచ్చు.

@ నాగప్రసాద్, KSKK, Madhu A303, aravind,
కృతజ్ఞతలు.

@ చివరి అజ్ఞాతలు,
కృతజ్ఞతలు.
చాలా చక్కగా చెప్పారు. ఒక్క రోజులోనే అన్ని తప్పులు ఒప్పయి పోయాయి. అన్నం లేకపోతే దొడ్డన్నం తినమన్న వాడు ఇప్పుడు అపర భగీరతునిగా మారిపోయాడు. అవకాశవాద రాజకీయ నాయకుల నోటికి అదుపు లేకుండా పోయింది.

శరత్ 'కాలమ్' said...

ఇదంతా సోనియా స్వయంకృతాపరాధం. తన మంచితనం/చేతకానితనం/మూర్ఖత్వం తో ఎంతమంది చెప్పినా వినకుండా వై ఎస్ కు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అపరిమితమయిన స్వేఛ్ఛ నిచ్చి ఇలా మహనీయుడిని చేసేసింది. ఇప్పుడు వై ఎస్ నే జగన్ రూపాన ఏకు మేకై కూర్చున్నాడు.

Anonymous said...

@శరత్, you are wrong. బంగారమ్మ తన "మంచితనం/చేతకానితనం/మూర్ఖత్వం " తో దేముడు గారికి అంత స్వెచ్చ ఇవ్వలేదు. సామంత రాజులందరికంటే కప్పం ఎక్కువ ఠంచనుగా కడుతున్నాడు మరియు తన మతానికి అందునా తన తెగకు చెందిన సామంతు రాజు అని. అంతకంటే బంగారమ్మే కప్పం కట్టే వాటికన్ తో కూడా సంభందభాందవ్యాలు ఉన్నవాడు అని. తన హయాంలో మిగతా సామంత రాజులకంటే తమ మతం లోకి జనాలను మార్చటం లో ముందు ఉన్నాడు అని.

ఇప్పుడు చెప్పండి, దేముడు గారు అనే సామంత రాజు కు, మహారాణి బంగారమ్మ అంత స్వెచ్చ ఇవ్వటం లో తప్పు ఏమైనా ఉందేమో?

శరత్ 'కాలమ్' said...

@ అజ్ఞాత
అలా వచ్చారా. జగన్ కడప ముఠాల ద్వారా రాష్ట్రంలో మరిన్ని భూములు కబ్జా చేసి అంతకంటే ఎక్కువ కప్పం కడతాడనుకుంటా - అయినా ఎందుకో అధిష్టానం సందేహిస్తోంది.

Anonymous said...

@శరత్, మంచి అనుమానమే లేపారు.

జగన్ యువరాజా వారు కట్టే కప్పం మీద నమ్మకం లేక కాదు, తిమ్మరుసు (kvp) ఎటూ ఉన్నాడు కదా, కాకపొతే రాచరికపు కట్టుబాట్లు తప్పినందుకు (మహారాణి గారు మీరు ఇస్తే తీసుకొని, మీకు కావాల్సిన కప్పం కడతాం అనాలే కాని, నాకు ఇవ్వల్సిందే అని అనకూడదు కదా) మాత్రమే ఇవ్వటానికి సందేహిస్తున్నారు.

లక్ష ఎకరాలు సైన్స్ సిటీ (ఎలాంటి సైన్స్ అని అడగకండి) పేరుతో, 28 వేల ఎకరాలు "వాన""పిక్" పేరుతో, ఓ పదివేల ఎకరాలు క్రిష్ట్న పట్టనం ఓడరేవు పేరుతో, కనీసం ఇంకో 20 నుండి 30 వేల ఎకరాలు వివిధ సెజ్ ల పేరుతో, ఓ 10 నుండి, 20 వేల ఎకరాలు గనుల పేరుతో, ఎప్పుడు పెడతారో తెలియని విమానాశ్రయాల పేరుతో ఇంకో పదివేల ఎకరాలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న స్థలాలు రింగు రోడ్డు వంకర టింకరలతో, హైదరాబాద్ లోపలి స్థలాలు "తిరగేసిన" సత్యం (matas) కంపెనీ పేరుతో నొక్కేసిన తరువాత పెద్దగా ఇంకా ఏమీ మిగిలలేదన నమ్మకమెమో!!

అన్నిటికంటే యువరాజా వారిది ఇంకా యువ రక్తం కదా ఎంత పవిత్ర రక్తం అయ్యినప్పటికీ, loyaltee ఎమైనా కొంచం ఓ చెంచాడు తక్కువేమో అన్న అనుమానం కూడా ఓ కారణం అయ్యిఉండవచ్చు.

ఏక లింగం said...

@ శరత్, అజ్ఞాత (మీరెవరో కానీ),
చాలా ఆసక్తికరమయిన విశయాలు చెబుతున్నారే..!!
Good going.

శరత్ 'కాలమ్' said...

@ అజ్ఞాత
చక్కగా సెలవిచ్చారు. జగన్ ని సామంతరాజుగా అధిష్టిస్తే అప్పాజీ మాటలు విని స్వాతంత్ర్యం ప్రకటించుకుని తానే రాజు అయ్యే ప్రమాదం వుంది.

Post a Comment